ఆ వ్యాధితో బాధపడుతున్న కత్రినా కైఫ్ ..?

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కత్రినా కైఫ్ ఓ వెలుగు వెలిగారు. కెరీర్ తొలినాళ్లలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కత్రినా కైఫ్..ఆ తర్వాత తనని తాను మార్చుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి స్టార్స్ హీరోలతో పాటు, రణబీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్,విక్కీ కౌశల్‌, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి యంగ్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

ఇక కత్రినా కైఫ్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె డ్యాన్స్‌కు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే, ఆమె ఏ రేంజ్‌లో అదరగొడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక పలువురు హీరోలతో కత్రినా కైఫ్ ఎఫైర్లను బాగానే నడిపింది.రణబీర్ కపూర్, సల్మాణ్ ఖాన్ వంటి హీరోలతో ప్రేమయాణం సాగించింది. ఆ తర్వాత వీరికి బ్రేకప్ చెప్పి..యంగ్ హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లాడింది. . 2021 డిసెంబర్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట.. ప్రస్తుతం ఎవరి ప్రొఫిషన్‌లో వారు బిజీగా ఉన్నారు.ఆ మధ్య కత్రినా గర్భవతి అయ్యారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

Katrina Kaif Suffering Incurable Disease

పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంట ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో క‌త్రినా తన పొట్టను దుపట్టాతో పదే పదే దాచుకుంటూ కనిపించారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తాను గర్భవతి కాలేదని ఈ భామ తెలిపింది. గుడ్ న్యూస్ ఉంటే అందరికి చెబుతానంటూ ప్రెగ్నెంట్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇదిలా ఉంటే కత్రినా కైఫ్‌కు సంబంధించిన ఆ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కత్రినా కైఫ్ అందమైన చీరకట్టుతో తళుక్కుమంటూ మెరిసింది.

అయితే ఈ సందర్భంగా ఆమె చేతికి ఓ నల్లటి ప్యాచ్ ఒకటి కనిపించింది. ఇప్పుడు దాని గురించి బాలీవుడ్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతోంది. కత్రినా కైఫ్ ధరించిన నల్లటి ప్యాచ్ ఫ్యాషన్‌కు సంబంధించినది కాదని నిజానికి అది డయాబెటిస్ ప్యాచ్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ షుగర్ మానిటర్ ప్యాచ్ అని వైద్యులు తెలిపారు.మధుమేహం ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర స్థాయి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు దీన్ని వినియోగిస్తుంటని వైద్యులు చెబుతున్నారు.

రక్తంలో చక్కెర స్థాయి తగ్గాయా.. పెరిగాయా? ఈజీగా తెలుసుకొని అలర్ట్ అవ్వడానికి డయాబెటిస్ ప్యాచ్‌లు ఉపయోగపడుతాయని వైద్యులు అంటున్నారు.కత్రినా కైఫ్ మానిటర్ ప్యాచ్ ధరించి కనిపించడంతో ఆమె బ్లడ్ షుగర్ బాధపడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో కత్రినా ఆరోగ్యంపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మానిటర్ ప్యాచ్‌పై కత్రినా క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి రుమర్స్ తెర మీదకు వస్తునే ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+