అతను నన్ను కోరిక తీర్చమన్నాడు.. పూరీ జగన్నాథ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ కావ్యా థాపర్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు. కావ్యా థాపర్ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..

కావ్యా థాపర్ చదువు పూర్తి కాగానే నటన వైపు అడుగులు వేసింది. యాడ్‌లో నటించే ఆఫర్ ఉందని తెలిసి ఆడిషన్ ఇచ్చేందుకు ఒక ఆఫీస్‌కి వెళ్లిందట. నీకు ఒకటి కాదు నాలుగు యాడ్స్ లో నటించే అవకాశం ఇస్తాము. కాకపోతే కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారట. అలాంటివి నాకు ఇష్టం ఉండదని సమాధానం ఇచ్చి అక్కడ నుంచి వచ్చేసిందట. కమిట్మెంట్ ఇస్తావా అని సిగ్గు లేకుండా అడిగారని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కావ్య థాపర్ అభిమానులతో పంచుకుంది. ఆమె మోడల్ కం యాక్ట్రెస్ కావ్యా థాపర్. తాను నటిని అవ్వాలన్నది నాన్న కల అందుకే సినిమాల్లోకి వచ్చానని.. ముందు మోడల్ గా మారి ఆ తర్వాత మూవీస్ చేస్తున్నానని ఆమె తెలిపారు.

Kavya Thapar reveals about the sexual harassment she faced in her life

ఇక కావ్య థాపర్ కెరీర్ విషయానికి వస్తే.. ఈ మాయ పేరేమిటో (2018) అనే తెలుగు సినిమాతో తన నటనా రంగ ప్రవేశం చేసిన తర్వాత, థాపర్ ఏక్ మినీ కథ (2021), మిడిల్ క్లాస్ లవ్ (2022)లో కనిపించింది, ఇది ఆమె హిందీలో అరంగేట్రం చేసిన పిచైక్కారన్ 2 (2023), ఆమె తమిళ తొలి చిత్రం. తెరకెక్కిన రవితేజ 'ఈగల్‌', సందీప్ కిషన్ నటించిన 'ఊరిపేరు భైరవకోన' , పూరీ జగన్నాథ్-రామ్ కాంబినేషన్‌లో 'ఇస్మార్ట్ శంకర్-2', గోపిచంద్ హీరోగా నటించిన 'విశ్వం' సినిమాల్లో కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలు ఏవి కూడా కావ్యా థాపర్ కెరీర్‌కు బ్రేక్ ఇవ్వలేకపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+