చార్ ధామ్ యాత్రలో సందడి చేస్తున్న... కేదార్‌నాథ్ నటి...
భారతదేశంలోని ఎంతో మంది భక్తులు జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లిరావాలి అని భావించే యాత్ర.. ఛార్‌ధామ్ యాత్ర.. ఇప్పుడు ఈ యాత్రలో బాలీవుడ్ తారలు కూడా సందడిచేస్తున్నారు. తాజాగా చార్‌ధామ్ యాత్రలో సందడి చేస్తూ కనిపించింది కేదార్‌నాథ్ నటి. కేదార్‌నాథ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సారా అలీ ఖాన్ తాజాగా పుణ్యక్షేత్రాలను సందర్శించే పనిలో బిజిగా ఉన్నారు. సారా ఆలీ ఖాన్ మాత్రమే కాదు. ఈ మధ్య బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది ఆధ్యాత్మికయాత్రలకు వెళ్లారు. ఖాన్ హీరోలతో పాటు, ఇతర తారలు కూడా పుణ్యక్షేత్రాలు సందర్శించే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా సారా అలీ ఖాన్.. చార్ ధామ్ యాత్రలో దిగిన ఫొటోలను, వీడియోలను సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పడు అవి వైరల్‌గా మారాయి.
సారాఆలీఖాన్ కేదార్‌నాథ్ యాత్ర : బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సారా ఆలీ ఖాన్. తన జీవితాన్ని తనే స్వయంగా లీడ్ చేసుకుంటుంది. ఈ మధ్యకాలంలోనే సారా కేదార్‌నాథ్ ను కూడా సందర్శించింది. కేదార్‌నాథ్ ను సందర్శించడం తనకు కొత్తేమీ కాదు. ఎందుకంటే బాలీవుడ్‌లో సారా నటించిన మొదటి చిత్రం కేదార్‌నాథ్. ఈ సినిమా షూటింగ్ అంతా కేదార్‌నాథ్‌లోనే జరిగింది.

ఈ షూటింగ్ కోసం ఆమె ఇక్కడే చాలా రోజులు ఉండాల్సొచ్చింది కూడా. అందుకే ఆ ప్రాంతమంటే సారాకు అంత ఇష్టం. అప్పటినుంచి ఈ ప్రాంతంపై సారా ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. అంతే కాదు.. ఇక్కడ ప్రతీ విషయం గురించి ఆమెకు తెలుసు. ఈ సినిమాలో హీరోగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించారు. సారా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి, మంచి వసూళ్లను కూడా రాబట్టింది.
ధ్యాన ముద్రలో ఉన్న ఫొటోలు : ఈ మధ్యనే సారా ఆలీఖాన్ ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైనా కేదార్‌నాథ్‌ను చుట్టేసింది. హిమాలయ పర్వత సానువుల్లోని ఎత్తైన కొండ దారిలో నడుచుకుంటూ వెళ్లి కేదార్‌నాథీశ్వరుడిని దర్శన భాగ్యం కల్పించుకుంది. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో పోస్ట్ చేసింది. సారా సంగీతం వింటూ ట్రెక్కింగ్ చేస్తున్న దృశ్యాలు కూడా ఇందులో ఉన్నాయి.
బండరాయిపై ధ్యాన ముద్రలో ఉన్న ఫొటోలు, సాధువు ఆమెను ఆశీర్వదిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక యాత్రకు తన స్నేహితులతో పాటు కలిసి వెళ్లింది సారా ఆలీఖాన్. కేదార్ నాధ్ సినిమా తరువాత సారా అలీఖాన్ బాలీవుడ్‌లో చాలా సినిమాలే తీసారు. అందులో లవ్ ఆజ్ కల్, లూకా చిప్పి, జరా హట్కే జరా బచ్‌కే వంటి సినిమాల్లో నటించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications