షాకింగ్ లుక్‌లో కీర్తి సురేశ్..జుట్టు మొత్తం తీసేసి

హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.

కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకున్నారు.ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నారు. గతంలో కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

Keerthy Suresh AI technology photos go viral

నేటి తరంలో పద్దతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్, ఈ రూల్స్‌ను బ్రేక్ చేస్తోంది. కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇక గతేడాది కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల తన ప్రేమను పరిచయం చేస్తూ మహానటి సర్ ప్రైజ్ ఇచ్చింది.

Take a Poll

కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్.తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కీర్తి ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఆప్డేట్స్ ఇస్తుంటుంది.పెళ్లి తర్వాత వరుస ఫోటో షూట్స్‌తో మతి పోగొడుతోంది.

ఇదిలా ఉంటే కీర్తి సురేష్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాయ్ హెయిర్ స్టైల్‌లో కనిపించి కీర్తి షాకిచ్చింది.మొదట కీర్తి ఏదైనా సినిమా కోసం ఇలాంటి లుక్‌లో కనిపించిందని అంతా భావించారు. తర్వాత కానీ అసలు విషయం తెలియలేదు. ఇది AI టెక్నాలజీతో రూపొందించిన ఫొటో ఇది. ఈ టెక్నాలజీతో నటీనటుల రూపాన్ని పూర్తిగా మార్చి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.కొందరు ఇలాంటి ఫొటోలు చేయడంపై విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు ఇలా కూడా ఫొటోలు చూపించవచ్చా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ కొత్త లుక్స్ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+