పెళ్లైన 10 రోజులకే భర్తను దూరం పెట్టేసిన కీర్తి సురేష్
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగింది. డిసెంబర్ 12న(గురువారం) అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది.తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్. కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడు ఆంటోనితో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది.
గోవాలో డిసెంబర్ 12న మ్యారేజ్ అని కూడా చెప్పారు. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్, తర్వాత తన భర్త ఆంటోని సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. ఈ సందర్భంగా భర్తకు లిప్‌లాక్ ఇచ్చింది. కీర్తి సురేష్. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక పెళ్లి తతంగం ముగియగానే కీర్తి సురేష్ తిరిగి తన సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.

ఈ ఏడాది కీర్తి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి బేబీ జాన్ అనే సినిమాలో నటించింది. పెళ్లికి ముందే షూటింగ్ పూర్తి చేసిన కీర్తి , పెళ్లి తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది.'బేబి జాన్' ప్రమోషన్స్ కోసం కీర్తి ముంబైలో అడుగుపెట్టింది. సాధారణంగా పెళ్లైన నూతన జంట ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. సెలబ్రిటీలు అయితే హానీమూన్ పేరిట విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. కానీ కీర్తి సురేష్ పెళ్లై 10 రోజుల కాకుండానే ముంబైలో ప్రమోషన్స్‌కు అటెండ్ అయింది. దీంతో కీర్తి సురేష్‌కు కెరీర్‌పై ఎంతో అంకితభావం ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, భర్త కన్నా సినిమాలు ఎక్కువా అంటూ మరిరకొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పెళ్లి తర్వాత కీర్తి సురేష్ హాట్ టాపిక్‌గా మారారు.












Click it and Unblock the Notifications