శుభవార్త చెప్పిన కీర్తి సురేష్.. దానికి రెడీ అంటూ పోస్ట్

అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు.

ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి.

keerthy suresh instagram post goes viral

ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌‌ల మధ్య కొన్ని లిప్‌ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

keerthy suresh instagram post goes viral

ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కీర్తి సురేష్ ఓ పెళ్లికి వెళ్తూ..సెల్ఫీ దిగి ఆ ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లికి సిద్ధమైనప్పుడు సెల్ఫీ తప్పనిసరి అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నువ్వు పెళ్లి సిద్ధం అయ్యావా.. లేదా ఎవరి పెళ్లికైనా రెడీ అయ్యావా అంటూ నెట్టింట కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుం కీర్తి సురేష్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+