పెళ్లికి ముందు షాకిచ్చిన కీర్తి సురేష్
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇటీవల కాలంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె తన సినిమాలతో కన్నా, వివిధ కారణాల ద్వారానే ఎక్కువగా వార్తలో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి చాలా వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి.అయితే గతానికి భిన్నంగా ఈసారి కీర్తి సురేష్ పెళ్లి గురించి బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ తన చెల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది.
వీరిద్దరు గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది. తాజాగా పెళ్లిపై కీర్తి సురేష్ కీలక ప్రకటన చేశారు. తన చిన్ననాటి మిత్రుడైన ఆంటోనితో కీర్తి సురేష్ పెళ్లికి సిద్దమైంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.తన ప్రియుడును ఆంటోనిని సోషల్ మీడియా ద్వారా పరిచియం చేసింది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది.

తన ప్రేమికుడు ఆంటోనితో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది. గత వారం రోజుల నుంచే కీర్తి సురేష్ పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. గోవాలో డిసెంబర్ 12న మ్యారేజ్ అని కూడా చెప్పారు. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని సమాచారం.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నీలి రంగు డిజైనర్ శారీలో ప్రత్యక్షమైంది. ఈ ఫోటోగ్రాఫ్ లో దేవతాసుందరిని తలపిస్తోంది. ముఖ్యంగా బ్లౌజ్ హైలెట్ అయ్యేలా ఇచ్చిన ఫోజులిచ్చింది. దీంతో కీర్తి సురేష్ మరోసారి తన హాట్‌నెస్‌ను బయటపెట్టింది.












Click it and Unblock the Notifications