అతనితో పెళ్లికి సిద్ధమైన అయిన కీర్తి సురేష్..!
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇటీవల కాలంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె తన సినిమాలతో కన్నా, వివిధ కారణాల ద్వారానే ఎక్కువగా వార్తలో నిలుస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్‌కు పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తన చెల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది.
అయితే గతానికి భిన్నంగా ఈసారి కీర్తి సురేష్ పెళ్లి గురించి బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆంటోని అనే వ్యక్తిని కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని సమాచారం.గతంలో కూడా కీర్తి సురేష్ పెళ్లి గురించి అనేక రూమర్లు వైరల్ అయ్యాయి. కీర్తి సురేష్ ..ఓ కమెడియన్‌ను వివాహం చేసుకున్నారని, ఆమె ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నారని, కీర్తి చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇలా అనేక కథనాలు వెలిశాయి.

కీర్తి సురేష్ పెళ్లిపై వచ్చినవన్నీ కూడా పుకార్లే అని తేలిపోయాయి. మరీ ఇది అయిన పెళ్లి వరకు వెళ్తుందేమో చూడాలి. ఇక కీర్తి సురేష్ కెరీర్ విషయానికి వస్తే... ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications