యంగ్ హీరోతో కీర్తి సురేష్ రొమాన్స్.. ఘాటైన లిప్ లాక్..?
ఇటీవల బాగా వినిపిస్తోన్న హీరోయిన్ల లిస్ట్‌లో కీర్తి సురేష్ కూడా ఒకరు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

అయితే ఇప్పుడు ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ ఏ హీరోతోనూ లిప్ లాక్ చేయలేదు. కాని కథ డిమాండ్ చేయడంతోనే ''బేబీ జాన్'' సినిమాలో వరుణ్ ధావన్‌కు లిప్ కిస్ ఇచ్చిందని సమాచారం. దీంతో పాటు సినిమాలో కీర్తి సురేష్ మరింత హాట్‌గా కనిపించనుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కీర్తి సురేష్‌కు బాలీవుడ్ నీళ్లు బాగానే పడ్డాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ''బేబీ జాన్'' సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
తెలుగు నిర్మాతలను అపర కుబేరులుగా మార్చిన 4 డబ్బింగ్ సినిమాలు -
నరసింహ నాయుడు, ఘరానా మొగుడు.. ఈ రెండు ఇండస్ట్రీ హిట్లలో ఏది బెస్ట్? -
‘పుష్ప2’, ‘ధురంధర్’ సినిమాల్లో అసలైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే?












Click it and Unblock the Notifications