జిమ్‌లో ఇన్నర్ వేర్ చూపిస్తోన్న కీర్తి సురేష్
తమిళ సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, నేను శైలాజా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తెలుగులో తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న కీర్తి సురేష్, వరుస సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారామె. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
ఆ తర్వాత ఈ అమ్మడు పలు చిత్రాల్లో గ్లామర్‌గా కనిపించి మెప్పించింది. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగిస్తోంది.ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి.

ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని కీర్తి సురేష్ లుక్స్ కొన్ని నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో కీర్తి ఫుల్ గ్లామర్‌గా దర్శనం ఇచ్చింది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో కూడా కీర్తి సురేష్ తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు.
తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. జిమ్‌లో సెల్ఫీ తీసిన ఫొటోను కీర్తి సురేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో కీర్తి సురేష్ మరింత గ్లామర్‌గా కనిపించి అదరగొట్టింది. గతంలో బొద్దుగా ఉన్న కీర్తి , ఇప్పుడు స్లిమ్‌గా మారి నాజుగ్గా కనిపిస్తోంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేయడానికి నానా తంటాలు పడుతోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ జిమ్‌లో తీసిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications