డిసెంబరు 11న కీర్తి సురేష్ పెళ్లి... అధికారికంగా ప్రకటించిన ఆమె తండ్రి

కీర్తిసురేష్ పెళ్లి గురించి కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటిని కీర్తి సురేష్ ఖండించింది. తాము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పింది. ఆ తర్వాత మరొకరితో ప్రేమలో ఉందంటూ తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దళపతి విజయ్ తో ప్రేమలో ఉందంటూ మరోవార్త... ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటికీ తాజాగా ఆమె తండ్రి ఫుల్ స్టాప్ పెట్టారు. కీర్తి సురేష్ కు వివాహాన్ని నిశ్చయించారు.

15 సంవత్సరాల నుంచి పరిచయం
కీర్తి సురేష్ కు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోని తటిల్ తోనే వివాహం జరగబోతోందని అధికారికంగా చెప్పారు. గోవాలోని ఓ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరుగుతుందన్నారు. దీంతో కీర్తి సురేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి రూమర్లన్నింటికీ చెక్ పడిందని, ఇకనైనా ఆపాలంటూ రూమర్లు క్రియేట్ చేసేవారిని వారు విన్నవించుకుంటున్నారు. డిసెంబరు 11 లేదంటే 12వ తేదీన వీరి వివాహం జరగబోతోంది. నెటిజన్లు కీర్తిసురేష్ - ఆంటోని తటిల్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Keerthy Suresh s wedding on December 11th officially announced by her father suresh kumar

అవార్డులు తెచ్చిపెట్టిన మహానటి, దసరా
తెలుగు సినీ పరిశ్రమకు నేను శైలజ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత 'నేను లోకల్', 'మహానటి', 'అజ్ఞాత వాసి', 'దసరా', 'మిస్ ఇండియా' వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మహానటి సినిమా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించిందని చెప్పొచ్చు. దీంతోపాటు దసరా చిత్రంలో కూడా అద్భుతమైన నటన కనపరిచింది. ఈ రెండు సినిమాలు ఆమెకు అనేక అవార్డులను తెచ్చిపెట్టాయి. కొన్నాళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని గోవాలో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయికానీ అవన్నీ రూమర్లే అనుకున్నారు. అయితే ఆమె తండ్రి సురేష్ కుమార్ ఈ వివాహాన్ని అధికారికంగా ప్రకటించడంతో వాస్తవమే అని ధ్రువీకరణకు వచ్చారు. సోషల్ మీడియాలో కీర్తిసురేష్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+