తల్లి అయిన రామ్ చరణ్ హీరోయిన్.. ఆడబిడ్డ పుట్టడంతో షాకింగ్ డెసిషన్..!

తల్లి కావాలని పెళ్లయిన ప్రతి మహిళకు ఉంటుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్స్ కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా పేరెంట్స్ అయ్యారు. ఈ చెప్పలేని ఆనందాన్ని తమ సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ పండంటి ఆడ బిడ్డకు జన్మ నిచ్చింది. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో ఆమె ప్రసవించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. అయితే తాము పేరెంట్స్ అయ్యామంటూ కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ తమ సామాజిక మాధ్యమాల వేదికగా ఆ విషయాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్, ఇతర సెలబ్రిటీలు ఆ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో 'భరత్​అనే నేను', 'వినయ విధేయ రామ' లాంటి పెద్ద పెద్ద సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది ఈ భామ. ఈ ఏడాది 'గేమ్ ఛేంజర్' సినిమాతో మరోసారి రామ్ చరణ్ తో జతకట్టి టాలీవుడ్ లో సందడి చేశారు. అయితే ఈ మూవీ ఆశించినంతవిజయం సాధించలేదు. కానీ చెర్రీ, కియారా కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయింది.

ఇక కియారా, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం విషయానికి వస్తే.. 2021లో వీళ్లిద్దరూ షేర్షా అనే మూవీ చేశారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8లో భాగంగా తన లవ్‌ స్టోరీని కియారా వెల్లడించారు. ఇటలీలోని రోమ్‌ లో సిద్ధార్థ్‌ మల్హోత్రా తనకు ప్రపోజ్‌ చేసినట్లు తెలిపింది. ఇక 2023 ఫిబ్రవరి 7 వ తేదీన రాజస్థాన్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

Kiara Advani and Sidharth Malhotra Welcome Baby Girl Embrace Parenthood

అయితే సాధారణంగా చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీ జంటలు తమ పిల్లల పేర్లను ముందే డిసైడ్ చేసుకుని పుట్టగానే ఆ పిల్లల పేర్లను ప్రకటిస్తారు. కానీ కియారా, సిద్ధార్థ్ జంట మాత్రం పేరును ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే కియారా.. తనకు ఆడపిల్ల పుడితే కియారా అనే పేరును పెట్టాలనుకున్నారట. కానీ కొన్ని పరిస్థితుల వల్ల తన పేరునే కియారాగా మార్చుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

కియారా అడ్వాణీ అసలు పేరు ఆలియా అడ్వాణీ. అయితే సినిమాల్లోకి వచ్చే సమయానికి అప్పటికే ఆలియా భట్ టాప్ హీరోయిన్ గా ఉంది. దీంతో సల్మాన్ ఖాన్ నాకు సలహా ఇచ్చారు. ఇండస్ట్రీలో ఇద్దరు ఆలియాలు ఎందుకు పేరు మార్చుకో అన్నారు. దీంతో నేను కియారా అని పేరు మార్చుకున్నా. అలా నా కూతురికి పెట్టాల్సి న పేరును నేను పెట్టుకోవాల్సి వచ్చింది.. అని తెలిపారు కియారా అడ్వాణీ. ఇప్పుడు కియారా.. తన కూతురికి ఏం పేరు పెడుతుందో అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+