నా ప్రయాణం ముగుస్తోంది: తెలుగు స్టార్ హీరో సంచలనం
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఏదో ఒకరోజు రిటైరవక తప్పదు.. కొత్తవారికి అవకాశం ఇవ్వక తప్పదు. ఇది సహజంగా జరుగుతుంటుంది. అలాగే కొన్ని టీవీ కార్యక్రమాలు కూడా సినిమాలకు మించి విశేష ఆదరణ దక్కించుకుంటాయి. కొంతమంది యాంకర్లు, నటులు, స్టార్ హీరోలు వీటికి హోస్ట్ గా వ్యవహరిస్తుంటారు. వీటిని చూడటానికి అలవాటుపడిన ప్రేక్షకులను ఆయా పాత్రల్లో వేరేవారిని ఊహించుకోలేరు. వారితో అంతగా మమేకమవుతారు. తర్వాత యాంకర్లు, హోస్ట్ లు మారితే ఆయా కార్యక్రమాల రేటింగ్స్ పడిపోతుంటుంది. తాజాగా కన్నడ స్టార్ హీరో సుదీప్ ఒక ప్రకటన చేశారు. బిగ్ బాస్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన ప్రయాణం ముగుస్తోందన్నారు.
అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా
కన్నడంలో బిగ్ బాస్ రియాలిటీ షోకు కిచ్చా సుదీప్ 11 సీజన్ల నుంచి ఏకధాటిగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన మ్యాక్స్ సినిమాతో సూపర్ హిట్ సాధించారు. ఓవైపు సినిమాలు చేస్తూనే బిగ్ బాస్ షోకు హోస్టింగ్ చేస్తున్నారు. తెలుగులో నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరించారు. కన్నడంలో సుదీప్ చేస్తున్నారు. ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో చేస్తున్నారు. హోస్టింగ్‌కు గుడ్ బై చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 11 సీజన్ల నుంచి ప్రేక్షకులు తనపై మంచి అభిమానాన్ని, ప్రేమను చూపించారని, అందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. హోస్ట్ గా తాను అందరికీ వినోదాన్ని పంచాననే భావిస్తున్నానన్నారు.

జీవితంలో మర్చిపోలేని ప్రయాణం
బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించడం అనేది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని, అలాగే మర్చిపోలేని ప్రయాణమని సుదీప్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం చేసేటప్పుడు తన శాయశక్తులా అత్యంత అద్భుతంగా ఉండేలా చేశానని, దాన్ని కొనసాగించానన్నారు. ఈ అవకాశం తనకిచ్చినవారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అకస్మాత్తుగా సుదీప్ ఈ నిర్ణయం తీసుకోవడంపై అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సుదీప్ మరిన్ని సీజన్లకు హోస్ట్ గా వ్యవహరిస్తారని అనుకున్నామని, కానీ మధ్యలో విరమించుకుంటూ తమకు ఆవేదన మిగిల్చారని అభిమానులంటున్నారు. షో మానేయడంద్వారా సినిమాలపై దృష్టిపెట్టి మరిన్ని సూపర్ హిట్లు సాధిస్తారని కిచ్చా అభిమానులు అంటున్నారు.












Click it and Unblock the Notifications