విషమంగానే శ్రీతేజ్... వెంటిలేటర్‌పైనే!

డిసెంబరు నాలుగోతేదీన సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న తొమ్మిది సంవత్సరాల శ్రీతేజ్ పరిస్థితి విషమంగానే ఉంది. థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి(35) మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ హీరో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కు ప్రస్తుతం ఆక్సిజన్ తోపాటు వెంటిలేటర్ సపోర్ట్ అవసరమవుతోందని, మూడురోజుల నుంచి ప్రసరణ కొనసాగడానికి తక్కువ మోతాదులో ఐనోట్రోపిక్ సపోర్ట్ కూడా అవసరమైనట్లు వైద్యులు వెల్లడించారు.

రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్
గత శనివారం నుంచి యాంటీ బయోటిక్స్ మార్చారు. శ్రీతేజ్ కు ఎటువంటి జ్వరం లేదని, నాడి పరిస్థితి యథావిధిగానే ఉందని, ఆహారం మాత్రం పైప్ ద్వారానే అందిస్తున్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఎడమవైపు ఉన్న ఇన్ ఫెక్షన్ తగ్గిందని చెప్పారు. తొక్కిసలాటలో శ్రీతేజ్ కోమాలోకి వెళ్లాడు. వారం రోజుల క్రితం కళ్లు తెరిచినప్పటికీ ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడని, బ్రెయిన్ డెత్ అని వైద్యులు వివరించారు. ఈ కేసులోనే అల్లు అర్జున్ చంచల్ గూడ జైలుకు వెళ్లారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయట ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.

kims hospital Doctors said that Sreetej needs ventilator support

కొడుకు చేతిని గట్టిగా పట్టుకున్న తల్లి
కోర్టు ఈకేసును జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో అప్పటికి వాయిదా వేశారు. దీన్నిబట్టి ప్రభుత్వం అంత పట్టుదలగా ఈ కేసులో లేదని, సులువుగానే బన్నీకి బెయిల్ లభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. అసెంబ్లీలో ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ తోపాటు సినీ పరిశ్రమకు చెందినవారు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఒక్కరు కూడా వెళ్లి పరామర్శించలేదన్నారు. రేవతి మరణించినప్పటికీ ఆమె తన కుమారుడి చేతిని గట్టిగా పట్టుకొని ఉందని, దీన్నిబట్టి తన ప్రాణాలు పోతున్నా కుమారుడి ప్రాణాలు కాపాడటానికి ఆ తల్లి ఎంతో ప్రయత్నించిందో అర్థమవుతోందని రేవంత్ చెప్పారు. జనవరి 10వ తేదీన అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ వస్తుందా? రాదా? అనేది తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+