అందుకోసమే నెల రోజుల పాటు ఆ పార్కులో తిరిగా - నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున.. స్టార్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆరు పదులు వయసు దాటినా కూడా ఫిజిక్ విషయంలో నేటి తరం హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇటీవల నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా' తొలి ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా హాజరై తన సినీ ప్రయాణం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
'నాగేశ్వరరావు అబ్బాయి' నుంచి 'నటుడు'వరకు..
సినిమాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ప్రేక్షకులు తనను 'నాగేశ్వరరావు అబ్బాయి'గా మాత్రమే చూశారని నాగార్జున గుర్తుచేసుకున్నారు. తన తొలి చిత్రాలు చూసి కొందరు మెచ్చుకుంటే, మరికొందరికి తన నటన నచ్చలేదని అన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా ఆరేడు సినిమాలు చేశానని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన 'మజ్ను' సినిమా తన కెరీర్‌కు ఒక బ్రేక్ ఇచ్చిందని, ఆ సినిమాతోనే తనలో ఒక నటుడు ఉన్నాడని ప్రేక్షకులు గుర్తించారని వివరించారు.

అలానే కమర్షియల్ చిత్రాల్లో 'ఆఖరి పోరాటం' పెద్ద హిట్ అయిందని, దానికి కారణం దర్శకుడు రాఘవేంద్రరావు, హీరోయిన్ శ్రీదేవి అని, ఆ సినిమాలో తాను ఒక బొమ్మలా మాత్రమే ఉన్నానని వినమ్రంగా చెప్పారు. ఆ తర్వాత తన మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
నెల రోజుల పాటు ఆయన వెంటపడ్డా..
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'మౌనరాగం' సినిమా తనకు బాగా నచ్చిందని నాగార్జున అన్నారు. ఆయన సున్నితమైన కథలకు తాను సరిపోతానని భావించానని మణిరత్నం వాకింగ్‌కు వెళ్లే పార్క్ గురించి తెలుసుకుని.. నెల రోజుల పాటు వెంటపడ్డానని చెప్పుకొచ్చారు. పది నిమిషాలు కలిసి నడిచిన తర్వాత మణిరత్నం టెన్నిస్ ఆడటానికి వెళ్లిపోయేవారని.. అయినా పట్టుదలతో ఆయన్ని ఒప్పించానని తెలిపారు. అలా వచ్చిన కథే 'గీతాంజలి'అన్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని తమిళంలో తీయాలని మణిరత్నం భావించగా.. తెలుగులోనే తీసి మార్కెట్ పెంచుకోవాలని తాను సలహా ఇచ్చానని నాగార్జున గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా తనకు పెద్ద హిట్ ఇవ్వడమే కాకుండా.. మణిరత్నంకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ దక్కిందని చెప్పారు.
ఆయన పాత్రలకు కూడా గొప్ప స్పందన లభించింది. నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు నాగార్జున ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన 'కుబేర', 'కూలీ'చిత్రాలు మంచి విజయం సాధించాయి.
-
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications