నటుడిని కాకపోతే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాడిని - కిరణ్ అబ్బవరం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో విభిన్న పాత్రలలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజు వారు రాణిగారు సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే 'క 'చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'దిల్ రుబా'. ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటుడుని కాకపోయి ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాడిని అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.

kiran abbavaram interesting words about political entry

అలానే ఇంకా మాట్లాడుతూ.. జీవితంలో ఏదో ఒకటి పెద్దగా సాధించాలనే కోరిక బలంగా ఉండేదని.. అందుకే హీరో కావాలనుకున్నానని చెప్పారు. అలానే తనకు రాజకీయాలంటే చాలా ఇష్టం అని అన్నారు. రాయలసీమకు చెందిన వ్యక్తిని కావడంతో చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ చాలా దగ్గరగా చూశానని చెప్పారు. మంచి, చెడు పక్కన పెట్టి ప్రజలతో మమేకం అవ్వడం గొప్ప విషయమని.. అది తనకు నచ్చుతుందన్నారు. అందుకే రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ అని చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా త్వరలోనే వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నానని కూడా చెప్పారు. రాయలసీమ స్టైల్‌ ఫుడ్ అందరికీ అందించాలనుకుంటున్నానని వివరించారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని త్వరలోనే అనౌన్స్‌ చేస్తానని కిరణ్ తెలిపారు.

మరోవైపు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దిల్ రూబా సినిమాకి వీలైతే మీ లవర్‌తో, కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ మీ ఎక్స్‌తో కలిసి సినిమాకి వెళ్ళండి. బయటికి వచ్చేటప్పుడు మీరు మీ లవర్, మీ ఎక్స్ ముగ్గురూ చాలా హ్యాపీగా బయటికి వస్తారు అంటూ చెప్పారు. ఎక్స్ మీద మనకు ప్రేమ పోవచ్చు కానీ ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటుంది. అందుకే ఈ సినిమాను వారితో కలిసి చూడండి అంటూ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+