దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన కిరణ్ అబ్బవరం: క్రేజీగా ఫిల్మ్ టైటిల్ టీజర్ అవుట్

వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరో.. కిరణ్ అబ్బవరం. 'క' చిత్రంతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు. కె- ర్యాంప్ తో తన విజయాల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తోన్నాడు. ఇప్పుడు అదే జోష్‌లో ఓ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. మెగా ఫోన్ పట్టాడు. దర్శకుడి అవతారం ఎత్తాడు. స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నాడు.

అదే.. 'రియాలిటీ' మూవీ. ఇందులో కిరణ్ అబ్బవరం హీరోగా మాత్రమే నటించట్లేదు. స్వయంగా కథను సమకూర్చుతూ దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టాడు. జాయ్ ఫిల్మ్స్ ఎల్ఎల్పీ బ్యానర్ కింద సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు దర్శకుడిగా మారడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా నటులు దర్శకులుగా మారడం సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు గానీ కెరీర్ ఎదుగుతున్న దశలోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం ఒక సాహసోపేతమైన నిర్ణయమే.

Kiran Abbavaram Upcoming Movie Reality teases out now Starring Devika Bhatt released on December 25

ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను కూడా పంచుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. క్రిస్మస్ సందర్భంగా రియాలిటీ.. ఆనందం వరల్డ్ ఆవిష్కృతం కాబోతోందని ప్రకటించారు. 'ఆనందం వరల్డ్' అంటే ఏమిటి, కిరణ్ ఎలాంటి కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఎప్పుడూ చేయని వైల్డ్ అండ్ రస్టిక్ రోల్ లో టాలీవుడ్ యంగ్ హీరో- టీజర్ విడుదల.. !!
ఎప్పుడూ చేయని వైల్డ్ అండ్ రస్టిక్ రోల్ లో టాలీవుడ్ యంగ్ హీరో- టీజర్ విడుదల.. !!

ఆనందం వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్ లో వంటవాడిగా కనిపించాడు కిరణ్ అబ్బవరం.. ఈ టీజర్ లో. ఆనందం అనే క్యారెక్టర్ లో నటిస్తోన్నాడు. కుటుంబ బాధ్యతలను మోసే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రను పోషిస్తోన్నాడు. అతని సరసన దేవికా భట్ కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్ర ఈ కథలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని సమాచారం. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ జోడీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

శరత్ కుమార్, సాయి కుమార్, రమేష్ ఇందిర కీలక పాత్రలను పోషిస్తోన్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మాస్ బీట్స్‌, మెలోడీలతో చార్ట్‌బస్టర్స్ సృష్టించిన భీమ్స్.. ఈ చిత్రానికి కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలను సిద్ధం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+