నాతో శృంగారం చేశాడని అమీర్ ఖాన్ భార్య విడాకులిచ్చింది

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో ఆయన్ను మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తుంటారు. విభిన్న కథలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అమీర్ ఖాన్ నుంచి సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని అభిమానులు ఎదురు చూస్తుంటారు. అయితే గత కొద్దికాలంగా అమీర్ ఖాన్ నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదు. గతంలో ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసే అమీర్ ఖాన్ నుంచి సినిమాలే రాని పరిస్థితి.

''లాల్ సింగ్ చెద్దా'' సినిమా ఫెయిల్ అయిన తరువాత అమీర్ ఖాన్ ఇప్పటివరకు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు. వెండితెర మీద మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరుగాంచిన అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్ ఖాన్ .. తన ఇద్దరి భార్యలకు విడాకులిచ్చారు. తాజాగా అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అమీర్ ఖాన్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

Kiran Rao says i am not reason Aamir Khan first wife Reena Dutta separated

అమీర్ ఖాన్‌ను పెళ్లి చేసుకునే సమయంలో తనపై నెగిటివ్ ప్రచారం జరిగిందని కిరణ్ రావు పేర్కొంది. అమీర్ ఖాన్‌ మొదటి భార్య రీనా ఉన్నప్పుడే ఆయన నాతో ప్రేమలో ఉన్నారని..నాతో శృంగారంలో పాల్గొన్నారనే కారణంతోనే రీనా అమీర్ ఖాన్‌‌కు విడాకులిచ్చిందనే ప్రచారం జరిగిందని కిరణ్ రావు తెలిపింది. అయితే రీనా అమీర్ ఖాన్‌ విడిపోవడానికి తాను కారణం కాదని చెప్పుకొచ్చింది. రీనాతో అమీర్ ఖాన్ విడిపోయిన తరువాతే ఆయనతో తనకు పరిచియం ఏర్పడింది.

Kiran Rao says i am not reason Aamir Khan first wife Reena Dutta separated

అమీర్ ఖాన్ చేస్తున్న మూవీకి తాను అసిస్టెంట్‌గా పని చేశాను. అప్పుడు ఏర్పడిన పరిచియం ప్రేమగా మారి, అది పెళ్లి వరకు వెళ్లిందని కిరణ్ రావు పేర్కొంది. అప్పటికే రీనా , అమీర్ ఖాన్ విడిపోయి రెండేళ్లు కావొస్తోంది. నా వల్ల వీరిద్దరు విడిపోయారంటే అది పచ్చి అబద్దం అంటూ కిరణ్ రావు ఈ ఇంటర్య్వూలో క్లారిటీ ఇచ్చింది. ఇక అమీర్ ఖాన్‌తో విభేదాలు తలెత్తడంతో కిరణ్ రావు సైతం అతని నుంచి విడాకులు తీసుకుంది. కిరణ్ రావు విడాకులు తీసుకునే సమయంలో దంగల్ నటితో అమీర్ ఖాన్ రిలేషన్‌లో ఉన్నారని.. అందుకే వీరిద్దరు విడిపోయారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం కిరణ్ రావు తన మాజీ భర్త గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+