"ఆ నటి నన్ను వాడుకుంది.. ఒక్కో ముద్దుకు రూ. 1000 ఇచ్చేది"
సాధారణంగా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు ఎన్నో ఆటుపోట్లను బరించాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. ఇక హీరో, హీరోయిన్ గా ఛాన్స్ లు రావాలంటే ఇచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే అవకాశాలు అందుతాయి. లేదంటే తట్టాబుట్టా సర్దుకుని వచ్చిన దారిన వెళ్లిపోవడమే ఉంటుంది. అయితే చాలా మంది స్టార్స్.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాము ఎలాంటి ఇబ్బందులు పడ్డామో ఒక స్థాయికి వచ్చాక చెబుతుంటారు. అవి వింటే ఒక్కోసారి షాకింగ్ గురవుతుంటాం.
అయితే తాజాగా ఓ మహిళా దర్శకురాలిపై బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ మహిళా డైరెక్టర్.. బుగ్గపై ఒక్కో ముద్దుకు 1000 రూపాయలు ఆఫర్ చేసిందిని చెప్పుకొచ్చాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా ముద్దులిచ్చి రూ. 1000 తీసుకోవాల్సి వచ్చేదని వివరించాడు. వేల కోట్ల విలువ చేసే సంస్థానం ఉన్నా కానీ.. ఒక డెబ్యూ హీరోగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డానని చెప్పాడు.

1990ల్లో కెరీర్ ప్రారంభించిన సైఫ్.. తొలి దశలో సైడ్ హీరో పాత్రల్లో నటించాడు. కానీ డబ్బు సంపాదించాలంటే కొన్ని అసహ్యకరమైన పనులు చేయాల్సి వచ్చేదన్నాడు సైఫ్. ఒక మహిళా నిర్మాత బుగ్గపై పది ముద్దులిస్తే 1000 చొప్పున ఆఫర్ చేసిందని గుర్తు చేసుకున్నాడు. అలా ప్రతిసారి 10 సార్లు ఆమె బుగ్గను ముద్దు పెట్టుకోవాలని డిమాండ్ చేసింది. లేడీ నిర్మాత వారానికి రూ.1000 చొప్పున చెల్లించేదని సైఫ్ తెలిపాడు. ఇటీవల ఆదిపురుష్, దేవర సినిమాల్లో విలన్ గా మెప్పించాడు సైఫ్ అలీ ఖాన్.












Click it and Unblock the Notifications