ఏం పాపం చేసిందో.. స్టార్ హీరోయిన్ కు అరుదైన వ్యాధి.. సినిమాలకు గుడ్ బై..!
తమిళ స్టార్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మొదట తమిళ సింగర్‌గా కెరీర్ మొదలుపెట్టింది ఆండ్రియా. తరువాత లిరిక్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. హీరోయిన్ గా ఆమె మొదటి మూవీ 'కండనాళ్ ముదల్. ఆ తర్వాత'పచ్చైకిళి ముత్తుచ్చరం' చిత్రంలో శరత్‌కుమార్‌కు జంటగా నటించి అభిమానుల మనసు దోచింది. 'వడ చెన్నై' చిత్రంలో ధనుష్ సరసన కనిపించి అలరించింది. ఆ తర్వాత ఆరన్మనాయ్, మాస్టర్, సైంధవ్ లాంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టింది నటి ఆండ్రియా. తాను అరుదైన ప్రాణాంతక వ్యాధి బారిన పడినట్లు ఎమోషనల్ అయింది. ఇటీవల హౌజ్ ఆఫ్ దీదీ అనే యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది ఆండ్రియా. " నేను అరుదైన చర్మ సంబంధిత వ్యాధి బారిన పడ్డాను. నా కళ్లు, కనుబొమ్మలు, కనురెప్పలు తెలుపు రంగులోకి మారడం గమనించాను. ఎప్పుడు నిద్ర లేచినా నా కళ్లు అలాగే తెలుపు రంగులో ఉండేవి. నా శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడటం చూశాను. వెంటనే రక్త పరీక్షలు చేయించుకున్నా. అందులో నార్మల్ అనే వచ్చింది. వెంటనే వైద్యులను అడిగాను. కారణం చెప్పమన్నాను. ఏదైనా కెమికల్ వళ్లగానీ.. ఎమోషనల్ స్ట్రెస్ వళ్లగానీ ఇలాంటి వ్యాధి బారిన పడి ఉండొచ్చని చెప్పారు. ఎమోషనల్ గా బాగా సఫర్ అవొద్దని సూచించారు" అని ఆండ్రియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

వడాచెన్నై సినిమా తర్వాత ఈ సమస్య అధికం అయింది. అందుకే చాలా గ్యాప్ తీసుకున్నానన్నారు ఆండ్రియా. అనారోగ్యం కారణంగా తాను సినిమాలకు దూరంగా ఉన్నానని.. కానీ కొందరు నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారని ఎమోషనల్ అయ్యారు. అందుకే ప్రస్తుతం ఏదీ పర్సనల్ గా తీసుకోకుండా జీవిస్తున్నానని.. నా కుక్క పిల్లతోనే నాకు రోజు గడుస్తోందని.. అదే నా జీవితాన్ని కాపాడుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. అనారోగ్యంతోనే మాస్టర్, పిసాసు చిత్రాల్లో నటించానన్నారు.
ఇక ప్రస్తుతం ఆండ్రియా మాస్క్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో కవిన్, తెలుగు నటి రుహానీశర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది.












Click it and Unblock the Notifications