Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం!

కొరియన్ డ్రామా ప్రియులకు చేదు వార్త. ప్రముఖ నటుడు జంగ్ యున్ వూ బుధవారం (ఫిబ్రవరి 11) ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన మరణవార్తను కొరియన్ మీడియా ధ్రువీకరించింది. అయితే ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. జంగ్ యున్ వూ మరణానికి సరిగ్గా ఒకరోజు ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఆయన తన పోస్ట్‌లో దివంగత హాంగ్ కాంగ్ నటుడు లెస్లీ చియుంగ్, బ్రిటిష్ గాయని అమీ వైన్‌హౌస్ ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలకు "మిస్సింగ్, అసూయపడుతున్నాను, చింతిస్తున్నాను.. PIR.BG" అనే క్యాప్షన్‌ను జోడించారు.

అంతేకాకుండా, అంతకుముందు ఆయన ఓ ఎర్రటి చంద్రుడి (Red Moon) ఫోటోను పోస్ట్ చేస్తూ.. "ఎర్రటి చంద్రుడు.. వేలాడదీసినా లేదా వేలాడుతున్నా.. అది ఎలాగైనా పడిపోతుంది" అంటూ అర్థం కాని రీతిలో క్యాప్షన్ ఇచ్చారు. ఆయన చివరి పోస్టులు చూస్తుంటే ఆయన ఏదో మానసిక వేదనలో ఉన్నారా అనే అనుమానాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Korean Actor Jung Eun Woo Dies at 40 Heartbreaking Final Instagram Post Goes Viral

సినీ ప్రస్థానం
1986లో దక్షిణ కొరియాలోని ఇన్చియాన్‌లో జన్మించిన జంగ్ యున్ వూ, డోంగ్‌గుక్ యూనివర్శిటీలో థియేటర్ అండ్ ఫిల్మ్ విభాగంలో చదువుకున్నారు. 2006లో 'రౌండప్ 3' అనే డ్రామాతో కెరీర్ ప్రారంభించారు. 'స్మైల్ ఎగైన్' (2011), 'బ్రైడ్ ఆఫ్ ద సన్' (2011), 'ఫైవ్ ఫింగర్స్' (2012) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.'ఫైవ్ ఫింగర్స్' చిత్రంలో తన నటనకు గాను 2012లో SBS డ్రామా అవార్డ్స్‌లో 'న్యూ స్టార్ అవార్డు' అందుకున్నారు. 2019లో వచ్చిన 'వెల్‌కమ్ టు వైకికి 2'లో ఆయన చివరిసారిగా కనిపించారు.

అంతిమ సంస్కారాలు
జంగ్ యున్ వూ అంత్యక్రియలు ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు (KST) బ్యోక్జే శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన హఠాన్మరణంతో సహచర నటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+