ఓటీటీలోకి వరుణ్ తేజ్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుస పరాజయాల అనంతరం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు 'కొరియన్ కనకరాజు' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఉపశమనాన్ని అందించింది. థియేటర్లలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి తగిన మద్దతు లభించడంతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని పాజిటివ్‌గా ముగించగలిగింది. 'కొరియన్ కనకరాజు' దేశవ్యాప్తంగా రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అమెరికాలో స్వల్ప నష్టాలు మిగిలినప్పటికీ.. ఓవరాల్ గా థియేట్రికల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 4,2026 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. అయితే ఎన్ని భాషల్లో వస్తుందనే దానిపై ఇంకా అధికారికంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

సాధారణంగా థియేటర్ ప్రేక్షకులకు, ఓటీటీ వీక్షకులకు సినిమాలను చూసే కోణంలో చాలా తేడా ఉంటుంది. థియేటర్లలో హిట్టయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చాక సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌కు గురికావడం, అలాగే థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో విపరీతమైన ప్రశంసలు అందుకోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ఓటీటీలో 'కొరియన్ కనకరాజు' ప్రదర్శన ఆసక్తికరంగా మారనుంది.
ఈ చిత్రంలో ప్లస్‌లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి. ఇవి ఓటీటీలో చిన్న తెరపై మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఇంట్లో కూర్చుని చూసే ప్రేక్షకులకు ఇందులో ఉండే కామెడీ బాగా నచ్చే అవకాశముంది. అదే సమయంలో ముఖ్యంగా సెకండాఫ్ లో ఉన్న స్క్రీన్‌ప్లే లోపాలు చిన్న తెరపై స్పష్టంగా బయటబడవచ్చు. అంతే కాకుండా క్లైమాక్స్ చిత్రీకరించిన విధానంపై కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ విడుదల 'కొరియన్ కనకరాజు' సినిమాకు రెండో లైఫ్ ఇస్తుందా లేక థియేట్రికల్ విజయంపై ప్రేక్షకుల అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుందా అనేది చూడాల్సిందే.














Click it and Unblock the Notifications