కోట శ్రీనివాసరావు ఛీ కొట్టిన ఏకైక నటి

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం, తెలుగు సినీ లోకానికి తీరని లోటు. నటనకు నిఘంటువుగా, ప్రతి పాత్రకు జీవం పోసే విలక్షణ నటుడిగా ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన గొంతులో పలికే ప్రతీ మాటా, ఆయన కళ్ళలో కనిపించే ప్రతి భావమూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించే సత్తా ఉన్న కోట, కేవలం నటుడిగానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా, ఆదర్శంగా నిలిచారు.కోట మృతితో యావత్తు సినీ లోకం మొత్తం కూడా శోక సంద్రంలో మునిగిపోయింది.

ఆయన మరణ వార్త సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోయింది సీనియర్ హీరోలు, కమెడియన్లు, నేటితరం హీరోలు, స్టార్ హీరోలు అందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.కోటకు ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు ఉంది. ఇదే సమయంలో ఆయన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా నిలిచారు. ముఖ్యంగా యాంకర్ అనసూయపై కోట చేసిన కామెంట్స్ అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి.

kota Srinivasa Rao-Anchor Anasuya controversy

వివాదం ఇదే
కోటా శ్రీనివాసరావు ఒక ప్రెస్‌ మీట్‌లో అనసూయ ఎవరో తనకు తెలియదని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత, ఆమె నటనా ప్రతిభను మెచ్చుకుంటూనే, ఆమె ధరించే దుస్తులు తనకు నచ్చవని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్రంగా స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా కోటా శ్రీనివాసరావు పేరు ప్రస్తావించకుండానే, ఒక సీనియర్ నటుడు నా వస్త్రధారణ గురించి మాట్లాడారని తెలిసింది. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఇలా నీచంగా మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం. వృత్తిపరమైన పరిస్థితులను బట్టి కూడా అలా ధరించి ఉండవచ్చు అనే విషయాన్ని ఎందుకు మరిచిపోయారు? ముఖ్యంగా అలాంటి సీనియర్ నటుడు మందు తాగుతూ, అధ్వానమైన దుస్తులను ధరించి ఎలా పేరు తెచ్చుకున్నాడో అర్థం కాలేదు అంటూ ఘాటైన ట్వీట్ చేశారు.

మానవత్వం చాటుకున్న అనసూయ
తాజాగా కోటా శ్రీనివాసరావు మరణించిన తర్వాత, అనసూయ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. గతంలో కోటా శ్రీనివాసరావు తనను అవమానించినప్పటికీ, అనసూయ మనసులో ఏమీ పెట్టుకోకుండా మానవత్వాన్ని చాటుకుందని కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు, అనసూయ తన ట్వీట్‌లో కోటా శ్రీనివాసరావు పేరు ప్రస్తావించకపోయినా, ఆయన మరణంపై స్పందించి పెద్ద మనసు చాటుకుందని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+