ఏపీ పంట పండింది... మరో కీలక రైల్వేలైను ప్రకటించిన నరేంద్రమోడీ
కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్లా జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి. రెండుచోట్లా ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ప్రతి ప్రసంగంలో చెబుతుంటారు. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తున్నారు. కేంద్రంలో, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలే ఉండటంతో ప్రాజెక్టులను వరుసపెట్టి మంజూరు చేస్తున్నారు. రాష్ట్రం అడగటమే ఆలస్యం అన్నట్లుగా కేంద్రం కూడా వెంటనే మంజూరు చేస్తోంది. బడ్జెట్ లో కూడా నిధులు భారీగా కేటాయించిన సంగతి తెలిసిందే.
భూములు స్వాధీనం చేసుకుంటున్న రైల్వే
తాజాగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో అత్యంత కీలకమైన కోటిపల్లి-నరసాపురం రైల్వేలైనుకు మోక్షం లభించింది. దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితమవుతున్న ఈ ప్రధాన ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ మార్గంలో అవసరమైన భూసేకరణ గతంలోనే పూర్తయింది. తాజాగా కోనసీమ కలెక్టర్ ఆదేశాల మేరకే రైల్వే అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకొని పనులు ప్రారంభిస్తున్నారు. భూసేకరణ జరిగినప్పటికీ పనులు ప్రారంభించకపోతుండటంతో రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం పంటల కోతకాలం కూడా పూర్తికావడంతో వెంటనే వాటిని స్వాధీనపరుచుకొని అధికారులు పనులు ప్రారంభిస్తున్నారు.

మరో పంట వేయకుండా వెంటనే పనుల మొదలు
భూసేకరణ పూర్తయిన ప్రతి గ్రామానికి అధికారులు ప్రత్యేక బృందాన్ని పంపించి భూములను సర్వే చేయిస్తున్నారు. హద్దులను గుర్తించిన తర్వాత పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఖాళీగా ఉంటే రైతులు మరో పంట వేస్తారని, అటువంటి అవకాశం ఇవ్వకుండా రైల్వే అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నదులపై మూడు వంతెనలు నిర్మించాల్సి ఉండటంతో బడ్జెట్ వ్యయం భారీగా పెరగనుంది. రూ.2,120 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ఇప్పటివరకు రూ.1181 కోట్లు ఖర్చుపెట్టారు. ప్రాజెక్టు వ్యయంతో 25 శాతాన్ని రాష్ట్రం భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. 2000-2001లో ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే తెలిపింది. దీన్ని సాధించడంలో దివంగత బాలయోగి, మాజీ కేంద్ర మంత్రి సత్యనారాయణలాంటివారు ఎంతో కృషిచేశారు.












Click it and Unblock the Notifications