దేశ సరిహద్దులో ప్రముఖ నగరాలు ఇవే.. విదేశాలకు వెళ్లిన ఫీలింగ్..!

భారత్ అంటేనే అనేక పర్యాటక ప్రాంతాలకు నెలవు. ఇక్కడ అనేక చారిత్రక ప్రాంతాలు, కట్టడాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఎన్నో అరుదైన ప్రదేశాలు, వింతలు, విశేషాలు టూరిస్టులను కనువిందు చేస్తున్నాయి. అందుకే భారత్ లో పర్యటించేందుకు విదేశాల నుంచి అనేకమంది టూరిస్టులు నిత్యం వస్తుంటారు. అయితే భారత్ లోని ప్రజలకు మాత్రం ఇతర దేశాల్లో పర్యటించాలని కోరికగా ఉంటుంది. కానీ పలు కారణాలతో వాళ్లు ఆయా దేశాలకు వెళ్లలేకపోతుంటారు. మరి దేశ సరిహద్దు దాటకుండానే విదేశాలకు వెళ్లినంత కిక్ ఇచ్చే ఫీలింగ్ ను కలుగజేసే దేశంలోని నెవర్ బిఫోర్ నగరాలు కొన్ని ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

వర్షాకాలంలో కేరళ టూర్ వెళ్లొద్దామా..? తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే..
వర్షాకాలంలో కేరళ టూర్ వెళ్లొద్దామా..? తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే..

సిక్కిం లోని నాథూ లా పాస్ సముద్ర మట్టానికి సుమారు 4,300 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం భారత్ లోని సిక్కిం ను అలాగే చైనాలోని టిబెట్ ప్రాంతాన్ని కలుపుతుంది. ఈ ప్రాంతం ప్రముఖ పర్యటక ప్రాంతంగా ఉంది. ఇక్కడి సుందరమైన మంచు పర్వతాలు, సరిహద్దు దృశ్యాలు పర్యటకులను ఆకర్షిస్తుంటాయి. ఇక్కడ స్థానిక మార్కెట్లు, ప్రశాంతమైన బౌద్ధ విహారాలు, మంచు పర్వతాల అందాలు పర్యటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. అలాగే మణిపూర్ లోని చిన్న పర్యాటక ప్రాంతంగా మోరే ఉంది. మయన్మార్ కు ప్రవేశద్వారంగా మోరేను పిలుస్తారు. భారత్- మయన్మార్- థాయిలాండ్ రహదారిలో ఈ ప్రాంతం కీలకమైన వాణిజ్య కేంద్రంగా ఉంది.

india tourist cities located along India borders visiting them gives you the feeling being abroad

పశ్చిమ్ బెంగాల్ లోని ఫుంట్ షోలింగ్ పట్టణం పర్యటకులకు స్వర్గధామంగా నిలుస్తోంది. భారత్- భూటాన్ శిల్ప కళలు, వంటకాలు, జీవనశైలుల సమాహారం ఇక్కడ అందరినీ అలరిస్తున్నాయి. ఇక్కడి రద్దీ మార్కెట్లు చాలా ఫేమస్ గా నిలుస్తున్నాయి. భూటాన్ కు వెళ్లే పర్యటకులకు సరిహద్దులోని ఫుంట్ షోలింగ్ ప్రాంతం ప్రధాన ద్వారంగా ఉంది. ఇక భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులోని దావ్కి గ్రామం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది. ఇక్కడ ఉన్న ఉమ్నోట్ నది ప్రకృతి అందాలకు నెలవుగా ఉంది. భారత సరిహద్దులోని ఈ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూసేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+