మహేష్‌బాబుకు కాకుండా నరేష్‌కు వచ్చిన రూ.వెయ్యి కోట్ల ఆస్తి
సూపర్‌స్టార్ కృష్ణ అనే పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. సినీ పరిశ్రమలో అత్యంత సాహసోపేతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమకు సినిమా స్కోప్, ఈస్ట్ మన్ కలర్, 70ఎంఎంలాంటివెన్నో పరిచయం చేశారు. తన కెరీర్ లో 350కు పైగా సినిమాల్లో నటించారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. ఇలా వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటుకోవడమే కాకుండా పద్మాలయ స్టూడియోను నిర్మించారు.
కష్టనష్టాలను అధిగమించి..
ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న కృష్ణ సినిమాలవల్ల ఎంతో సంపాదించారు.. అలాగే ఎంతో కోల్పోయారు. సంపాదించిన డబ్బును సినిమాల్లోనే పెట్టుబడి పెట్టేవారు. కృష్ణకు భార్య ఇందిరాదేవి ఉన్నారు. వారికి ఆడపిల్లలతోపాటు మహేష్ బాబు, రమేష్ బాబు కుమారులు ఉన్నారు. విజయనిర్మల కృష్ణ రెండో భార్యగా ఉన్నారు. వీరిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్. కృష్ణతో వివాహానికి ముందే నరేష్ అనే కొడుకు ఉన్నాడు.

ఎకరం రూ.100 కోట్లపైనే
కృష్ణకు చెందిన రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తి నరేష్ కు దక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. నానక్ రామ్ గూడలో ఉన్న 12 ఎకరాల ఖరీదైన స్థలం నరేష్ పేరుమీద ఉందంటున్నారు. కృష్ణ-విజయనిర్మల కలిసి నానక్ రామ్ గూడలో 12 ఎకరాలను అప్పట్లో కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసే సమయంలో ఎకరం ఖరీదు రూ.1.3 లక్షలు. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఎకరం స్థలం రూ.100కోట్లకు పైనే ఉంది. 12 ఎకరాలంటే రూ.1200 కోట్లకు పైనే. అటువంటి ఖరీదైన ఆస్తి నరేష్ పేరుమీద ఉంది.
ఉమ్మడి ఆస్తి కావడంతో నరేష్ కు..
నరేష్ మొదటి నుండి కృష్ణ, విజయ నిర్మలతో కలిసి ఉండేవారు. నానక్ రామ్ గూడలోని 12 ఎకరాలు నరేష్ కు ఇచ్చారు. మిగిలిన ఆస్తులను మహేష్ బాబు, రమేష్ బాబుకు ఇచ్చారు. కృష్ణ-విజయనిర్మలకు చెందిన విలువైన ఉమ్మడి ఆస్తి నరేష్ కు వచ్చింది. చాలాసార్లు, చాలా సందర్భాల్లో నరేష్ మీడియాతో మాట్లాడుతూ తన ఆస్తి రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications