కింగ్డమ్ మూవీపై హిమాన్షు షాకింగ్ రివ్యూ.. విజయ్ దేవరకొండ రిప్లై
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సత్యదేవ్ కీలక పాత్రలో మెరిశారు. మూవీలో విజయ్ యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్, బ్యాక్ డ్రాప్ బాగుందని టాక్ వినిపిస్తోంది. దీంతో చాలా ఏళ్ల తర్వాత కొండన్నకు హిట్ పడిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
అయితే కింగ్డమ్ మూవీని తాజాగా కేటీఆర్ కుమారుడు హిమాన్షు చూసి తన అభిప్రాయాన్ని తెలిపారు. కింగ్డమ్ సినిమాకు హిమాన్షు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. విజయ్ దేవరకొండ నటనను హిమాన్షు ప్రశంసించారు. ఈ సినిమాను చూసేందుకు హైదరాబాదు ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని థియేటర్ కు వెళ్లారు. సినిమా చూసిన తర్వాత హిమాన్షు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇద్దరు స్నేహితులతో కలిసి కింగ్డమ్ చూశానని తెలిపారు. మొదటిసారిగా థియేటర్ లో సినిమా చూడటం ఉత్సాహభరితంగా అనిపించింది. థియేటర్ లోని బిగ్ స్క్రీన్, ఆడియన్స్ మధ్య కింగ్డమ్ వైబ్ గూస్ బంప్స్ తెప్పించాయి అని తెలిపారు. హిమాన్షు ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

హిమాన్షు ట్వీట్ కు విజయ్ దేవరకొండ హార్ట్ ఈమోజీతో రిప్లై ఇచ్చారు. హిమాన్షు రివ్యూ ఇవ్వడం, విజయ్ దేవరకొండ రిప్లై ఇవ్వడంతో ఈ ఇద్దరు సెలబ్రిటీల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇద్దరు స్టార్స్ చేసిన ట్వీట్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక విజయ్ కింగ్డమ్ పై స్టార్ హీరోయిన్ రష్మిక మందాన్న కీలక పోస్టు చేసింది. ఎక్స్ వేదికగా రష్మిక చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. "నాకు తెలుసు.. ఈ సినిమా నీకు.. నిన్ను ప్రేమించేవారికి ఎంత ముఖ్యమైనదో అని. ఒక మంచి హిట్కోసం ఎంతగా ఎదురుచూశావో, నిన్ను అభిమానించేవారికి కూడా తెలుసు. మనం కొట్టినమ్" అంటూ రష్మిక విష్ చేసింది. అయితే ఈ ట్వీట్ కు విజయ్ దేవరకొండ.. రిప్లై ఇచ్చాడు. 'మనం కొట్టినమ్' అంటూ ఓ హార్ట్ సింబల్ యాడ్ చేశాడు. దీంతో కొండన్న , రష్మిక ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications