కుబేర' ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్..!

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా వంటి భారీ తారాగణంతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'కుబేర' చిత్రం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యుల నుంచి అందిన తొలి రివ్యూలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి.అక్కడ సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కుబేర: తొలి రివ్యూలో ఏముంది?
'కుబేర' చిత్రం దాదాపు 3 గంటల 1 నిమిషం నిడివితో వస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద రన్ టైమ్ ఉన్న సినిమాలు చాలా అరుదు. అయితే, సెన్సార్ సభ్యులు సినిమాలోని కంటెంట్ బాగుందని, రన్ టైమ్ పెద్ద సమస్య కాదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సినిమాలోని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కవుట్ అయ్యాయని, శేఖర్ కమ్ముల కెరీర్ లోనే ఇది ఒక బెస్ట్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు.

Kubera movie first review

నటీనటుల పెర్ఫార్మెన్స్, ఇతర హైలైట్స్
బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటన సినిమాకు హైలైట్ అని, ఈ చిత్రం విడుదలయ్యాక ఆయన నటన గురించి అందరూ మాట్లాడుకుంటారని సెన్సార్ వర్గాలు చెబుతున్నాయి. శేఖర్ కమ్ముల ధనుష్ పాత్రను తీర్చిదిద్దిన తీరు మెస్మరైజ్ చేస్తుందట. కింగ్ నాగార్జున ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని, ధనుష్‌తో పోటాపోటీగా నటించారని టాక్.రష్మిక కెరీర్ లో గుర్తుంచుకునే పాత్రను 'కుబేర'లో చేసిందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని, టీజర్, ట్రైలర్ లోనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుందని అంటున్నారు.నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు అందుకుంటున్నాయి.

కొన్ని ల్యాగ్స్ ఉన్నా... క్లైమాక్స్ అద్భుతం!
సెకండాఫ్ లో కొన్ని ల్యాగ్స్ ఉన్నప్పటికీ, క్లైమాక్స్ లో చివరి 15 నిమిషాల డ్రామా అన్ని లోపాలను సరిచేస్తుందని సెన్సార్ రివ్యూలో పేర్కొన్నారు. బిచ్చగాడు, కోటీశ్వరుడు, మిడిల్ క్లాస్ మనిషి, జీవితంపై ఆశ కోల్పోయిన అమ్మాయి... ఈ నలుగురి మధ్య నడిచే కథగా 'కుబేర' తెరకెక్కినట్టు తెలుస్తోంది. మొత్తం మీద, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే ధీమాతో చిత్ర యూనిట్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+