నాకు అన్నీ ఆయనే.. విదేశాలకు వెళ్తున్నాం: మోసాలిసా సంచలన పోస్ట్
మహా కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా జర్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోడానికి మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. కానీ తన అందంతో ఒక్కరోజులోనే నేషనల్ రేంజ్ లో పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా సినిమా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వద్దే ఉంటూ యాక్టింగ్ పై శిక్షణ తీసుకుంటోంది మోనాలిసా. యాక్టింగ్ ట్రైనింగ్ అనంతరం తాను రూపొందించే ది డెయిరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో లీడ్ రోలో ఇవ్వనున్నట్లు సమాచారం.

అయితే మోనాలిసా, సనోజ్ మధ్య ఏదో ఉందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఆయన కావాలనే ఆమెను ట్రాప్ చేసి పబ్లిసిటీ కోసం వాడుకోవాలని చూస్తున్నారని హిందీ చిత్రపరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను సనోజ్ మిశ్రా ఖండించారు. ఆ వ్యాఖ్యలను చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ మేరకు పోలీసులు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అయితే తాజాగా వైరల్ గర్ల్ మోనాలిసా సంచలన పోస్ట్ పెట్టింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా వద్ద యాక్టింగ్, సింగింగ్ అన్నీనేర్చుకుంటున్నానని తెలిపింది. ఇక డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో కలిసి నేపాల్ వెళ్తున్నట్లు తెలిపింది. నేపాల్ లోని మౌళాపూర్ లో మహాశివరాత్రి సందర్భంగా మాధని మహోత్సవ్ అనే మ్యూజికల్ ఫెస్ట్ లో పాల్గొని ఆడి పాడనున్నట్లు పేర్కొంది. ఈమేరకు నేపాల్ కు చెందిన కంపెనీ మోనాలిసాకు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. నేపాల్ తర్వాత మోనాలిసా తిరిగి కేరళలోని ఓ మ్యూజికల్ ఫెస్ట్ లోనూ పాల్గొనబోతోందని సమాచారం. ఈ వివరాలకు సంబంధించిన ఇన్ స్టా వీడియోను ఆమె తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు.
తాజాగా మోనాలిసా.. తన ఇన్ స్టా వీడియోలో మై ప్రేయర్ వీడియో అని ఓ వీడియోను పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ అయింది. ఈ రీల్ లో ఆమె 1986 అంకుశ్ చిత్రంలోని ఇట్నీ శక్తి ముజే దేనా మాతా అనే సాంగ్ కు రీల్ చేసింది. ఈ వీడియో సూపర్ అంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications