టాప్ లేచిపోయే సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే.. రూ.100 కోట్ల కలెక్షన్లు..
ఇటీవలి కాలంలో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. తెలుగులో లిటిల్ హార్ట్స్, మహావతార్ నరసింహా, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు అలాంటివే. ప్రేక్షకులకు స్టోరీ కనెక్ట్ అయితే చాలు మూవీకి ఏం రేంజ్ కలెక్షన్లు వస్తాయో ఊహించడం కూడా కష్టమే. అంతలా ఆడియన్స్ గుండెల్లో పెట్టుకుంటారు. అయితే ఓ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం రూ. 50 లక్షలతో నిర్మిస్తే.. రూ. 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి ఎవరూ ఊహించని విజయంగా నిలిచింది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మరి ఈ సినిమా ఏంటి..?
సినిమాలో కంటెంట్ ఉంటే అది చిన్న సినిమానా..? లేక పెద్ద సినిమానా..? అని చూడరు. అలా చాలా చిన్న సినిమాలు ఎలాంటి హడావుడి.. హంగూ ఆర్భాటం లేకుండా సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఇప్పుడు గుజరాత్ లో ఓ చిన్న సినిమా కూడా అలాంటి విధ్వంసమే చేస్తోంది. రిలీజై 50 రోజుల కావొస్తున్నా.. రూ. 100 కోట్ల కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే.. దర్శకుడు తీసిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇప్పుడు ఎవరినీ అడిగినా గుజరాతీ సినిమా 'లాలో' గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీకి అంకిత్ సఖియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రీవా రచ్, శృహద్ గోస్వామి, కరణ్ జోషిలు.. తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. గతనెల అంటే అక్టోబర్ 10న చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. మెల్లగా మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. లాలో సినిమా రిలీజై దాదాపు 50 రోజులు కావొస్తున్నా.. ఇప్పటికీ కళ్లు చెదిరే కలెక్షన్లు రాబడుతుంది.












Click it and Unblock the Notifications