నీ భర్తను నాతో ఓ రోజు పంపిస్తావా ..? హీరోయిన్‌కు యువతి మెసేజ్
సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా నేరుగా అభిమానులతో ముచ్చటిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. తమ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సెలబ్రిటీలు సమాధానం ఇస్తుంటారు. అయితే ఇక్కడ కూడా వారికి వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఓ హీరోయిన్‌కు ఓ లేడీ ఫ్యాన్ పెట్టిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సినీ స్టార్ కపూల్స్‌లో హీరో సూర్య , హీరోయిన్ జ్యోతిక జంట కూడా ఒకటి. తమిళ ఇండస్ట్రీలో బెస్ట్ కపూల్‌గా ఈ జంట పేరు సంపాదించుకున్నారు.
ఇండస్ట్రీలో ఇద్దరూ తమని తాము నిరుపించుకున్నవారే. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఇటీవలే తన సెంకడ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస హిట్లలను తాన ఖాతాలో వేసుకుంది. ఇక సూర్య విషయానికి వస్తే తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ప్రస్తుతం సూర్య కంగువ సినిమాలో నటిస్తున్నాడు. సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. జ్యోతిక రీసెంట్‌గా నటించిన "సైతాన్" సినిమా హిందీలో విడుదలైంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంగా జ్యోతిక చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెబుతూ ..ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే..సూర్య అభిమాని జ్యోతికకు మెసేజ్ చేసింది.

"మీ భర్త అంటే నాకు చాలా ఇష్టం ..ఒక్కరోజు అప్పుగా ఇస్తారా ..?" అంటూ ఓపెన్ గాని అడిగేసింది. దీనికి జ్యోతిక కూడా సూపర్ గా రిప్లై ఇచ్చింది . "నో నో అది ఎప్పటికీ జరగని పని " అంటూ ఫన్నీ గానే ఆన్సర్ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications