పండుగ నాడు శుభవార్త చెప్పిన మెగా కోడలు..?
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి.
నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె ఇటీవలే మిస్ పర్‌ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది. ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.

ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారంట. నాగబాబు కోడలు, హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీ తల్లికాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దసరా పండుగ నాడు లావణ్య త్రిపాఠి తన తల్లితో ఈ శుభవార్త చెప్పినట్లు జనాలు నెట్టింట చర్చించుకుంటున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగి తేలుతున్నారని ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా ఉంచారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వెల్ కమ్ బుల్లి మెగా హీరో అంటూ విషెష్‌లు పెడుతున్నారు. అయితే దీనిపై వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్పందించలేదు.












Click it and Unblock the Notifications