లావణ్య త్రిపాఠి షాకింగ్..న్యాయం కోసం పోరాడతానంటూ ట్వీట్
హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పరిచియమైంది. తన తొలి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరితోనూ లావణ్య త్రిపాఠి నటించింది. ఇక మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. ''మిస్టర్'', ''అంతరిక్షం'' సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు.
ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్లింది. 2023 నవంబర్ 1న వీరిద్దరు ఒకటయ్యారు.పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా, లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది.

ఆ మధ్య 'మిస్ పర్‌ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది.ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పెళ్లి అయిన ఏడాది తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించింది. 'సతీ లీలావతి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి తాజాగా ఓ షాకింగ్ ట్వీట్ చేసింది. ప్రముఖ రిపోర్టర్ ముకేష్ చంద్రకర్‌ను కొందరు దుండగలు హతమర్చారు.
#JusticeForMukeshChandrakar https://t.co/YJSYAhYgVm
— Lavanyaa konidela tripathhi (@Itslavanya) January 11, 2025
భారీ స్కాంమ్‌ను బయటపెట్టడంతోనే అతన్ని చంపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఘటనపై లావణ్య పోరాటం మొదలెట్టింది. అతడికి న్యాయం చేయాలంటూ ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్ జోడించి మరీ ముకేష్ చంద్రకర్ పేరును పెట్టింది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలపై స్పందించరు. కానీ లావణ్య త్రిపాఠి ఈ ఘటనపై స్పందిస్తూ బాధిత కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications