Lavanya-Rajtarun Issue: ప్రముఖ హీరో వీడియోలు లీక్.. పోలీసులకు హార్డ్ డిస్క్ అందజేసిన లావణ్య

Lavanya-Rajtarun Issue: కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సారి రాజ్ తరుణ్ విషయంలో కాకుండా మస్తాన్ సాయి అనే వ్యక్తి దగ్గర ఏకంగా 300 వీడియోలు ఉన్నాయంటూ లావణ్య అతని బండారాన్ని బయటపెట్టింది. ప్రేమ, పెళ్లి పేరుతో యూట్యూబర్ మస్తాన్ సాయి అమ్మాయిలను లోబర్చుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తంగా దాదాపు 300 వీడియోలను మస్తాన్ సాయి ఒక హార్డ్ డిస్క్ లో భద్రపరచగా.. దాన్ని ఆమె పోలీసులకు అందించి మస్తాన్ సాయిని అరెస్ట్ చేయించింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయి దురాగతాలు వెలుగులోకి వచ్చాయి.

తనపై కూడా అత్యాచారం చేసినట్లు ఆరోపించిన లావణ్య.. హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపే ప్రయత్నం చేసినట్లు వివరించారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ప్రముఖ హీరోకు సంబంధించిన వీడియోలు, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు సమాచారం. ప్రముఖ హీరో మొబైల్ ఫోన్ ను మస్తాన్ సాయి హ్యాక్ చేసినట్లు తెలిసింది. ఎంతో మంది మహిళల కాల్ రికార్డింగ్స్, వాళ్లతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడిన వీడియోలు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు సమాచారం.

Lavanya Unveils Mastan Sai s Illegal Activities Over 300 Leaked Videos Submitted to Police

లావణ్యపై అత్యాచారం చేస్తూ మస్తాన్ సాయి ఆ వీడియోను రికార్డ్ చేశాడని, తన వీడియోలు డిలీట్ చేయాలని లావణ్య అడగడంతో ఆమెపై దాడి చేశాడని తెలుస్తోంది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు చేసి హార్డ్ డిస్క్ ను అందించగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వరలక్ష్మి టిఫిన్స్ కేసులో డ్రగ్స్ విషయమై ఇప్పటికే మస్తాన్ సాయి, లావణ్యలు అరెస్టయిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+