మెగా హీరోలకు మరోసారి తన స్టామినా నిరూపించిన అల్లు అర్జున్
మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.
దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు. పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ టాప్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్‌లో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో నిలవగా, ఈ జాబితాలో అల్లు అర్జున్ నాలుగో స్థానంలో నిలిచారు. మెగా హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ జాబితాలో టాప్ -10లో చోటు దక్కించుకోలేకపోయారు. దీంతో అల్లు అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.నంద్యాల ఎన్నికలు జస్ట్ శాంపల్ మాత్రమే అని భవిష్యత్తులో అసలైన ఆట ఏమిటో చూపిస్తామంటూ మెగా ఫ్యాన్స్‌కు అల్లు అభిమానులు కౌంటరిస్తున్నారు.












Click it and Unblock the Notifications