వామ్మో.. విశ్వక్‌సేన్ కొత్త సినిమా టీజర్ చూస్తే షేక్ అవుతారు..!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రూట్ మార్చాడు. ఇప్పటివరకూ కామెడీ, రొమాంటిక్ మూవీస్ తో అలరించిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు రాజకీయనాయకుడి పాత్రలో రక్తికట్టించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లెగసీ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. న్యూ ఇయర్ కానుకగా ఈ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. హీరో శ్రీరామ్‌తో పిండం సినిమా చేసిన సాయి కిరణ్ దైడ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వక్ సేన్. ఆ తర్వాత పాగల్, ఓరి దేవుడా, అశోకవనంలో అర్జున కల్యాణం, గామి, దంకీ, మెకానిక్ రాకీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లైలా తదితర చిత్రాలతో మెప్పించాడు. ఇప్పుడు తాజాగా కొత్త అవతారం ఎత్తాడు. పక్కా పొలిటికల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి లెగసీ అని టైటిల్ పెట్టారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ న్యూ ఇయర్ కానుకగా రిలీజైంది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
'రాజకీయం అంటే పులి మీద సవారీలాంటిది అంటారు. మరి ఆ పులి మీద ఆ నాయకుడు మాత్రమే కూర్చోవాలా? అతని కుటుంబం మొత్తం కూర్చోవాలా? దిగితే చంపేస్తారు కదా.. మరి అతని కుటుంబం, వారసులు, తన ఫ్యామిలీ లెగసీ ఏమైపోవాలి? అంటూ విశ్వక్ సేన్ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ మూవీని హీరో శ్రీరామ్‌తో పిండం సినిమా చేసిన సాయి కిరణ్ దైడ తెరకెక్కిస్తున్నాడు. తండ్రి సమాధిపైన మూత్రం పోసే సీన్ టీజర్ లో షాకింగ్ గా ఉంది. ఈ మూవీ ఈ ఏడాదిలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

తండ్రి సమాధిపైన మూత్రం పోసే అగ్రెసివ్ యువ నాయకుడిగా విశ్వక్ సేన్ కనిపించబోతున్నాడు. టీజర్ చూస్తుంటే కుళ్లిపోయిన రాజకీయాలతో విసిగిపోయిన ఓ యువ నాయకుడు, తన అగ్రెసివ్‌తో మార్పు కోసం చేసే ప్రయత్నంగా 'లెగసీ' కనిపిస్తోంది.. ఈ మూవీ 2026లోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి..
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications