కోట శ్రీనివాసరావు కన్నుమూత
Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఈ తెల్లవారు జామున 4 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
నాలుగు దశాబ్దాలకు పైగా తన సుదీర్ఘ కెరీర్‌లో ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు. తనదైన ముద్రవేశారు. ఏ క్యారెక్టర్ అయినా అందులో పరకాయప్రవేశం చేయడం ప్రత్యేకత. కామెడీ క్యారెక్టర్లు మొదలుకుని కరడుగట్టిన విలన్ ఎలాంటి పాత్రలనైనా అవలీలగా నటించగలరనే పేరు తెచ్చుకున్నారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పలు నంది అవార్డులను అందుకున్నారు. పలు పురస్కారాలు ఆయనను వరించాయి. రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు కోట శ్రీనివాస రావు.
అటల్ బిహారీ వాజ్ పేయి స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీలో చేరారు. శాసన సభకూ ఎన్నికయ్యారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ ఈస్ట్ నుంచి ఘన విజయం సాధించారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సినిమాలకు పరిమితం అయ్యారు.












Click it and Unblock the Notifications