హీరో నితిన్ కు ధోనీ సర్ప్రైజ్ గిఫ్ట్ ...!!
యంగ్ హీరో నితిన్ కు ఒక ప్రముఖ వ్యక్తి నుంచి ఊహించని గిఫ్ఠ్ అందింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరో నితిన్ నటిస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్దం అవుతోంది. తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ నుంచి నితిన్ కు ఒక గిఫ్ఠ్ అందింది. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. డేంజర్ పిల్లా, బ్రష్ వేసుకో అనే పాటలు సంగీత ప్రియులను బాగా అలరిస్తున్నాయి. ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైన్ చేసిన టీ షర్ట్ ను నితిన్ కు గిఫ్ట్ గా అందించాడు. నితిన్ తాజా మూవీ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ బెస్ట్ విషెస్ చెప్పారు.

EXTRAORDINARY gift from an EXTRAORDINARY MAN… Thankuu @msdhoni sir for this!! Love u ❤️ pic.twitter.com/dNTeXl1JOe
— nithiin (@actor_nithiin) November 29, 2023
ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ పై నితిన్ స్పందించాడు. "ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నుంచి ఎక్స్ ట్రా ఆర్డినరీ బహుమతి. ఈ కానుక అందించిన ధోనికి ధన్యవాదాలు. లవ్ యూ" అంటూ ట్వీట్ చేశాడు. టీషర్ట్ పట్టుకొని దిగిన స్టిల్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గిఫ్ఠ్ చూసిన నితిన్ ఆనందంలో మునిగిపోయాడు. నితిన్ ఇప్పుడు ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8న విడుదల కానుంది. ఈ సినిమాతో నితిన్ పక్కా హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇక, ఇప్పుడు ధోనీ ఈ సమయంలో పంపిన గిఫ్ట్ తో మరింత హ్యాపీ ఫీలవుతున్నారు.












Click it and Unblock the Notifications