కట్టుకున్న భార్యకు విడాకులిచ్చి.. హీరోయిన్స్‌తో ఎఫైర్స్ పెట్టుకున్న హీరోలు వీళ్లే..!
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధం కావడంతో మరోసారి తమ భార్యలకు విడాకులిచ్చి, మరో హీరోయిన్‌తో ప్రేమలో హీరోల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే..

అక్కినేని వారసుడు నాగార్జున సైతం తన మొదటి భార్యకు విడాకులిచ్చారు. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జున వివాహం జరిగింది. 1984 వీరి పెళ్లి జరగ్గా..1986లో వీరికి నాగ చైతన్య జన్మించాడు.అయితే లక్ష్మితో పెళ్లి నాగార్జునకు మొదటి నుంచి ఇష్టం లేకపోవడంతో వీరిద్దరు కొన్నాళ్లు వీడిపోయారు. ఆ తర్వాత శివ, నిర్ణయం,చినబాబు, ప్రేమ యుద్ధం, కిరాయి దాదా సినిమాల్లో నటించిన అమలతో మరోసారి ప్రేమలో పడటంతో నాగార్జున ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. నాగార్జునతో విడాకులు తర్వాత లక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. లక్ష్మి విడాకులు ఇవ్వగానే అమలాని నాగార్జున వివాహం చేసుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం తన మొదటి భార్యకు విడాకులిచ్చారనే విషయం అందరికి తెలిసిందే. పవన్ కల్యాణ్ మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లాడారు. 1996లో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు నందినిని పెళ్లి చేసుకున్నారు.. నందిని విశాఖపట్నానికి చెందిన అమ్మాయి.నందినిని మొదటిసారి సత్యానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో పవన్ కలిశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సినిమా ప్రారంభమైన ఏడాది తర్వాత వీరిద్దరూ హైదరాబాద్‌లో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అయితే నందిని, పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం సంతోషంగా సాగలేదు. వివాహం అయిన వెంటనే తన భార్య తనతో ఉండలేదని.. ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయిందని పవన్ ఆరోపించారు. కాని ఆమె ఈ ఆరోపణలు ఖండించింది. విడాకుల సమయంలో ఇద్దరు ఒకరిమీద మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. విడాకుల సమయంలో మొదటి భార్య నందినికి 5 కోట్ల భరణం చెల్లించాడు. తర్వాత హీరోయిన్ రేణు దేశాయ్‌తో ప్రేమలో పడి,ఆమెను రెండో వివాహం చేసుకున్నారు.

హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. నాగ చైతన్య ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

ఇక బాలీవుడ్ హీరోలు సైతం తమ మొదటి భార్యకు విడాకులిచ్చి హీరోయిన్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన మొదటి భార్య అమృతాసింగ్ విడాకులిచ్చి ..బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్‌ని లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.5 ఏళ్లు డేటింగ్ తరువాత వీరు 2012లో పెళ్లి చేసుకున్నారు.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య రీనాదత్తా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ 16 ఏళ్ల తర్వాత , తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ తరువాత 2005 లో బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావుతో ప్రేమలో పడ్డారు.వెంటనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కూడా సరిగ్గా 16 ఏళ్ల కలిసి ఉన్నారు. ఆ తరువాత రెండో భార్యకు సైతం అమీర్ విడాకులిచ్చారు.

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ తన భార్యకు విడాకులిచ్చారు.ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్‌ను 2000లో పెళ్లి చేసుకున్న హృతిక్ 2014లో విడాకులు తీసుకున్నాడు. వీరికి హ్రేహాన్ రోషన్, హృదాన్ రోషన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్ కంగానతో హృతిక్ కొన్నాళ్లు ఎఫైర్ కొనసాగించాడు. తర్వాత వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. హృతిక్ ప్రస్తుతం బాలీవుడ్ నటి సబా అజాద్‌తో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం వీళ్లిద్దరు సహజీవనం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications