రేణు దేశాయ్ ఒక్కరే కాదు..పవన్ కళ్యాణ్ వల్ల బలైన హీరోయిన్స్ లిస్ట్ పెద్దదే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికి ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
లక్షలాది అభిమానులు ఆయన్ను అభిమానిస్తుంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం పవన్ కల్యాణ్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన పవన్ అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వరుస హిట్లు కొట్టి పవన్ కల్యాణ్ స్టార్ హీరో అయ్యాడు కానీ, ఆయనతో నటించిన హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలో లేకుండా పోయారనేది ఈ వార్త సారాంశం.

పవన్ కల్యాణ్ మొదటి సినిమా 'ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి' సినిమాలోని హీరోయిన్ సుప్రియ, సూపర్ హిట్ గా నిలిచిన సుస్వాగతం చిత్రంలోని దేవయాని, 'తొలిప్రేమ' హీరోయిన్ కీర్తి రెడ్డి, 'తమ్ముడు' మూవీ హీరోయిన్ ప్రీతి జింగానియా, 'బద్రి' మూవీలో అమీషా పటేల్, 'గుడుంబా శంకర్' లో నటించిన మీరా జాస్మిన్, బంగారం హీరోయిన్ మీరా చోప్రా, 'జల్సా' చిత్ర కథానాయిక ఇలియానా,పులి మూవీలో నటించిన నికీషా పటేల్, పంజాలోని సారా జేన్ దియాస్, 'అజ్ఞాతవాసి' చిత్ర హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్,అన్నవరం సినిమాలో హీరోయిన్ అసిన్..ఇలా చెప్పుకుంటే లిస్ట్ పెద్దగానే ఉంది.
వీరెవ్వరు కూడా ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. మరి కొంతమంది అయితే ఎక్కుడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇక పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మొదటి సినిమా బద్రి హిట్ కాగ, రెండో సినిమా జానీ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆమెతో పవన్ సహజీవనం చేయడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. పవన్‌తో విడాకులు అనంతరం రేణు దేశాయ్ క్యారెక్టర్ ఆరిస్ట్‌గా మారి తిరిగి సినిమాల్లో నటిస్తోంది.












Click it and Unblock the Notifications