30 కోట్లు పెడితే.. 300 కోట్లు వసూలు చేసిన చిన్న సినిమా
సాధారణంగా పెద్ద సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలకే భారీ అంచనాలు ఉంటాయి. కానీ, కొన్నిసార్లు చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసి, అంచనాలను తలకిందులు చేస్తాయి. సరిగ్గా అలాంటి అద్భుతమే చేసింది మలయాళీ సెన్సేషన్ 'లోక ఛాప్టర్ 1 చంద్ర' (తెలుగులో 'కొత్త లోక').
ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఎలాంటి హైప్ లేదు. స్టార్ కాస్ట్ లేకపోవడం, చిన్న సినిమా ట్యాగ్‌తో పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడం దీనికి కారణాలు. కానీ, ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అబ్బురపరిచే యాక్షన్ సీన్స్ మరియు ఊహించని ట్విస్టులు ఈ సినిమాకు ప్రేక్షకులను క్యూ కట్టించాయి. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టింది. మలయాళంలో ఇప్పటికీ పలు చోట్ల ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్, డాన్స్ మాస్టర్ శాండీ, విజయరాఘవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మలయాళ స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, షౌబిన్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాను స్వయంగా దుల్కర్ సల్మాన్ నిర్మించడం విశేషం. ఈ విజయం ఇందులో భాగమైన యాక్టర్స్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఓటీటీ ప్రేమికులకు పండగే
థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సెన్సేషనల్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిరీక్షణకు తెరపడింది. 'కొత్త లోక' డిజిటల్ స్ట్రీమింగ్‌పై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది.
త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. కచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించకపోయినా, త్వరలోనే రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తామని పోస్టర్ ద్వారా ప్రకటించారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సంచలన చిత్రం దీపావళి కానుకగా ఓటీటీలోకి రావచ్చని తెలుస్తోంది. ఇక ఈ బ్లాక్‌బస్టర్‌ను ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి చూసే అవకాశం త్వరలో రానుంది
-
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ???












Click it and Unblock the Notifications