దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన శృతి హాసన్ (వీడియో)
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్‌ను పాడు చేసింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. మైఖేల్‌తో విడిపోయిన తర్వాత మద్యానికి బానిస అయ్యానని, ఆరోగ్య సమస్యలతో బాధపడ్డానని శ్రుతి హాసనే స్వయంగా చెప్పుకొచ్చింది.

చేసిన తప్పును గ్రహించిన శృతి హాసన్..తిరిగి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. 2023లో ఆమె ఖాతాలో నాలుగు హిట్లు చేరాయి. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి'', నానితో ''హయ్ నాన్న'' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. ప్రభాస్‌తో నటించిన సలార్ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో..గతేడాది శృతి హాసన్‌కు బాగా కలిసి వచ్చింది.
తాజాగా శృతి హాసన్ తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కానగరాజ్‌తో రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళ నట లోకేష్ కానగరాజ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఇటీవలే లోకేష్ లియో సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్‌తో ఓ సినిమా తెరకెక్కించే పనిలో పడ్డాడు. అయితే ఈ గ్యాప్‌లో హీరోయిన్ శృతి హాసన్‌తో కలిసి ఓ సాంగ్‌లో నటించాడు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
#Inimel the game begins from 25th March.
— Raaj Kamal Films International (@RKFI) March 21, 2024
Mark the Moment!
Streaming exclusively on https://t.co/UXpv3RSFt6#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelat25th@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit… pic.twitter.com/LCAju1D2eq
లోకేష్‌తో శ్రుతిహాసన్ ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసింది. ఈ 18 సెకన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సాంగ్ ప్రోమోలో శ్రుతిహాసన్ తన అందాలతో రెచ్చిపోయింది. అటు లోకేష్ సైతం శ్రుతిహాసన్‌కు ధీటుగా నటించాడు. ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications