టైటిలే కాదు భయ్యా..సినిమా కూడా వెరైటీగానే ఉంది..!

కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన హారర్‌ కామెడీ చిత్రం 'లోపలికి రా చెప్తా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన ప్రమోషన్స్‌తో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథాంశం: రామ్ హైదరాబాద్‌లో ఓ డెలివరీ బాయ్. నగర వీధుల్లో తిరుగుతూ ఉల్లాసమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ రోజు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అందమైన అమ్మాయి రుక్మిణిని చూసి తోలి చూపులోనే ఇరువురు నంబర్స్ మార్చుకుంటరు. అక్కడ అసలు కథ మొదలవుతుంది. ఓ రోజు రామ్‌ను ఆమె తన ఇంటికి పిలుస్తుంది. అనుమానం వస్తుందని ఎంట్రీ గేట్ వద్ద విల్లా నంబర్ మార్చి రాసి వెళ్తాడు. కొన్నాళ్లకు రామ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ రామ్ గతంలో చేసిన తప్పు వలన శోభనం రోజున వచ్చిన ఇబ్బంది ఏంటి. రామ్ భార్యలో ఆవహించిన దెయ్యం ఎవరు.? ఈ కష్టాలు నుండి రామ్‌ ఎలా బయట పడ్డాడు. దెయ్యం బారి నుంచి భార్యని రామ్ కాపాడుకున్నాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: దర్శకుడు కమ్ హీరో రాజేంద్ర (వెంకట రాజేంద్ర) ఈ కథను కేవలం ఒక చిన్న పాయింట్‌గా కాకుండా, ఫన్ జోనర్‌లో మార్చి, ప్రేక్షకులను నవ్వులతో అలరించాడు.ముఖ్యంగా, యువతను ఆకట్టుకునే రొమాంటిక్ అంశాలను కామెడీకి జోడించి మంచి వినోదాన్ని అందించినట్లు తెలుస్తోంది. దర్శకుడు వెంకట రాజేంద్రకు తన సినిమా ప్రేక్షకులెవరో స్పష్టమైన అవగాహన ఉందని, దానికి తగినట్లే సినిమాను రూపొందించాడని అర్థం అవుతోంది. సినిమా నిడివి విషయంలో కూడా రాజేంద్ర పర్ఫెక్షన్ చూపించాడు. ఫస్టాఫ్ గంట పది నిమిషాలు, సెకండాఫ్ నలభై నిమిషాలతో సినిమాను పర్ఫెక్ట్‌గా ముగించాడు. ఇది ప్రేక్షకులకు విసుగు లేకుండా, కథను సరైన సమయంలో పూర్తి చేయడానికి ఇది సహాయపడింది.

Lopaliki Ra Chepta movie review

నటీనటుల ప్రతిభ:
హీరో కమ్ డైరెక్టర్ కొండా వెంకట రాజేంద్ర తన నటనతో, దర్శకత్వంతో సినిమాను విజయవంతంగా నడిపించారు. ఆయనకు మంచి భవిష్యత్ ఉందని చెప్పొచ్చు. సుస్మిత అనాలా అద్భుతమైన నటన కనబరిచింది. మనిషా జష్నాని కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అయితే, ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నటుడు వంశీ, 'బ్లాక్ స్పారో' పాత్రలో మెప్పించారు. విలన్ పాత్రలో కార్తీక్ భయపెట్టాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు బాగా నటించారు.

Lopaliki Ra Chepta movie review

సాంకేతిక విలువలు:
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినా, ఆ లోపం ఎక్కడా కనిపించకుండా దర్శకుడు కొండా వెంకట రాజేంద్ర సినిమాను చక్కగా రూపొందించారు. డేవ్ జాండ్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలం. నేపథ్య సంగీతం (RR), పాటలు సినిమా స్థాయిని పెంచాయి. రేవంత్, అరవింద్ సినిమాటోగ్రఫీ సినిమాను మరింత రిచ్‌గా చూపించింది. అయితే, ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేది. శృంగారపరమైన సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా, యువత మాత్రం వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు.

ప్లస్‌లు
సినిమా కథ
కామెడీ
క్లైమాక్స్
సినిమాటోగ్రఫీ

మైనస్‌లు
ప్రొడక్షన్ వాల్యూస్
పెద్ద తారాగణం లేకపోవడం

మొత్తంగా, గత కొంతకాలంగా హారర్ చిత్రాలకు కామెడీని జోడించి విజయాలు సాధిస్తున్న ట్రెండ్‌ను 'లోపలికి రా చెప్తా' కూడా కొనసాగిస్తుందని చెప్పొచ్చు. హారర్, కామెడీ అంశాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది.

రేటింగ్: 2.75

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+