ఈ ట్రైలర్ ఏంటి భయ్యా ఇలా ఉంది..!

మాస్ బంక్ మూవీస్ పతాకంపై రూపొందిన "లోపలికి రా చెప్తా" చిత్రం ప్రేక్షకుల్లో రోజురోజుకు క్రేజ్‌ను పెంచుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది. కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ బేస్డ్ కామెడీ ఎంటర్‌టైనర్, జులై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించారు.

శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ట్రైలర్ లాంఛ్ జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొండా విజయ్ కుమార్, నటులు రమేష్, ప్రవీణ్ కటారి, శుభలేఖ సుధాకర్, లిరిసిస్ట్ అలరాజు తదితరులు పాల్గొన్నారు.

lopaliki ra chepta movie trailer goes viral

రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..ట్రైలర్ చూశాక మీలో భయం కలిగే ఉంటుంది. మనల్ని భయపెట్టే విషయాలు ఈ సినిమాలో లాగే బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టాలని ఆకాంక్షించారు. నటుడు రమేష్, క్యాచీ టైటిల్‌తో మా సినిమా ప్రేక్షకులను భయపెడుతూనే ఎంటర్‌టైన్ చేస్తుందన్నారు. లిరిసిస్ట్ అలరాజు, లోపలికి రా చెప్తా అనే టైటిల్‌లో ఒక బెదిరింపు ఉంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా టైటిల్ మూవీకి కరెక్ట్‌గా జస్టిఫై అయ్యిందని భావిస్తారని పేర్కొన్నారు.దర్శకుడు కొండా విజయ్ కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారు కొండా వెంకట రాజేంద్ర నూతన ఆలోచనలతో సినిమాలు చేస్తారని ప్రశంసించారు.

హీరో, డైరెక్టర్ కొండా వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. రచయిత విజయేంద్రప్రసాద్ శిష్యుడిని అయినందుకు గర్వంగా ఉందని చెప్పారు. స్క్రీన్‌ప్లేలో తన పదేళ్ల అనుభవంతో ఈ చిత్రాన్ని రూపొందించానని, నాలుగైదు జానర్స్‌ను కలిపి స్క్రిప్ట్ చేశానని తెలిపారు. ఈ సినిమా వెనక రెండేళ్ల హార్డ్ వర్క్ ఉంది.

lopaliki ra chepta movie trailer goes viral

మా ప్రొడ్యూసర్ గణేష్ లేకుంటే ఈ మూవీ లేదు. హారర్, కామెడీతో పాటు యూత్‌కు కావాల్సిన రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రేక్షకులకు వారి లైఫ్‌లో ఎన్నో ఒత్తిడులు ఉంటాయి. మా సినిమాకు వస్తే ఆ టెన్షన్లన్నీ రిలీఫ్ అవుతారని గ్యారెంటీగా చెప్పగలనని ధీమా వ్యక్తం చేశారు. దేవ్ జాండ్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయని, ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని ఆయన పేర్కొన్నారు. జూలై 5న విడుదలయ్యే ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+