ఆ హీరోతో నటించి నా కెరీర్ పాడు చేసుకోలేను
లవ్‌టూడే సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఇవానా నటన అందరిని ఆకట్టుకుంది. లవ్‌టూడే సినిమాతో మంచి ఇవానాకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా ద్వారా యూత్‌లో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. లవ్‌టూడే హిట్ తరువాత ఇవానాకు తమిళంలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
ఇవానా ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడుకు స్టార్ హీరో పక్కన నటించే అవకాశం వచ్చినప్పటికీ కూడా దాన్ని రిజెక్ట్ చేసింది. అయితే అది హీరోకు చెల్లెలు పాత్ర కావడంతో ఆ సినిమా నుంచి ఇవానా తప్పుకుందని సమాచారం. ఆ హీరో మరెవ్వరో కాదు తమిళ స్టార్ హీరో విజయ్.

తమిళనాట ఇళయ దళపతి విజయ్‌కు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత అంతటి రేంజ్ ఫాలోయింగ్ విజయ్‌కు సొంతం. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభూ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించారు.
అయితే సినిమాలో విజయ్‌కు చెల్లెలు పాత్ర కోసం లవ్‌టూడే హీరోయిన్ ఇవానాను చిత్ర యూనిట్ సంప్రదిస్తే..ఆమె ఆ సినిమాను రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. హీరోయిన్‌గా నటిస్తున్న తనకు చెల్లెలు పాత్రల్లో నటిస్తే తరువాత సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయని భావించే ఇవానా ఈ సినిమాకు నో చెప్పారట. ఆమె స్థానంలో నటి , మోడల్ అభియుక్తను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది.












Click it and Unblock the Notifications