బోల్డ్ అండ్ రొమాంటిక్‌కు మరో లెవెల్.. ఈసారి కథలు మరింత హాట్ గురూ!

Lust Stories 3 Trailer: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'లస్ట్ స్టోరీస్ 3' ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ఈ ఆంథాలజీ సిరీస్‌లోని మూడో భాగంలో నలుగురు దర్శకులు, కొత్త నటీనటులు కలిసి పనిచేశారు. ఇందులో నాలుగు వేర్వేరు కథలను అందించబోతున్నారు. ఇందులో ఆకర్షణ, వివాహం బంధంలో వచ్చే సమస్యలు, ఇంకా ప్రజలు తరచుగా బయటకు చెప్పుకోని విచిత్రమైన విషయాల చుట్టూ తిరిగే కథలు ఉన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మోక్షజ్ఞ సరసన హిట్ బ్యూటీ?
నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మోక్షజ్ఞ సరసన హిట్ బ్యూటీ?

'లస్ట్ స్టోరీస్ 3' ట్రైలర్ ఒకే కథపై ఆధారపడకుండా నాలుగు భిన్నమైన ప్రపంచాలను చూపిస్తుంది. ఈ నాలుగు భాగాలకు విక్రమాదిత్య మోత్వాని, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ఇక తారాగణం విషయానికి వస్తే రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావ్ హైదరీ, రాధికా మదన్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, సిద్ధార్థ్, అలీ ఫజల్, సనా తంపి, గుర్పతే పిర్జాదా వంటి ప్రముఖ నటులు ఈ సిరీస్‌లో తమ నటనతో అలరించనున్నారు.

Lust Stories 3 Trailer Released Netflix Anthology to Stream on Sep 18 Exploring desire and marriage

ఈ ట్రైలర్లో సంబంధాల సంక్లిష్టతను ఇంట్రెస్టింగ్ సంభాషణలతో చూపించారు. వివాహ బంధంలో వచ్చే చిన్న చిన్న విభేదాలు, వ్యక్తిగత కోరికల మధ్య ఉండే తేడాలను దర్శకులు చక్కగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ట్రైలర్లో ఓ మహిళ "స్త్రీలు లైట్ బల్బుల లాంటి వారు కాదు.. వారు మండి కరిగిపోయే కొవ్వొత్తులతో సమానం" అని చెప్పే డైలాగ్ బాగా ఆకట్టుకుంటుంది. మరో సీన్ లో అదితీ రావ్ హైదరీ తన విద్యార్థులతో ఆకర్షణ, కోరికల అంతరార్థాన్ని చర్చిస్తూ కనిపించారు.

 నాని 'ది ప్యారడైజ్' ఊచకోత: కేవలం 4 గంటల్లోనే!
నాని 'ది ప్యారడైజ్' ఊచకోత: కేవలం 4 గంటల్లోనే!

కేవలం డ్రామా మాత్రమే కాకుండా.. కథలకు తగ్గట్టుగా వినోదాన్ని కూడా జోడించారు. ఒక సన్నివేశంలో కొంకణా సేన్ శర్మ, రాధికా ఆప్టే పాత్రలు "మిన్, జిన్" లకు సంబంధించిన ఓ ప్రేమ వ్యవహారం గురించి చర్చిస్తుంటారు. తాము కొరియాలో కాదని, కాండివాలిలో ఉన్నామని రాధిక కొంకణాకు గుర్తు చేయడంతో ఆ సంభాషణ ఓ హాస్యభరితమైన మలుపు తీసుకుంటుంది. మరోవైపు రాధికా మదన్, అలీ ఫజల్ దంపతుల మధ్య జరిగే విచిత్రమైన చర్చలు, అలాగే అదితి రావ్ హైదరీ, సిద్దార్థ్ కాంబినేషన్లోని సన్నివేశాలు కథలపై ఆసక్తిని పెంచుతున్నాయి.

కాగా 2018లో మొదలైన మొదటి 'లస్ట్ స్టోరీస్', 2023లో వచ్చిన 'లస్ట్ స్టోరీస్ 2' రెండు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు అదేబాటలో సరికొత్త ఆలోచనలు, కాన్సెప్టులతో వస్తున్న 'లస్ట్ స్టోరీస్ 3' కూడా ఓటీటీ ప్రియులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+