'పొలిమేర-2' రివ్యూ : ట్విస్ట్‌‌లతో కూడిన చేతబడి

కరోనా సమయంలో ఓటీటీకి ఆదరణ పెరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సమయంలో విడుదలైందే పొలిమేర సినిమా. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో పొలిమేర సినిమా తెరకెక్కింది. పొలిమేర -1ను తెరకెక్కించిన దర్శకుడు అనిల్ విశ్వనాథ్.. పొలిమేర -2కి కూడా దర్శకత్వం వహించారు.

పొలిమేర సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మొదటి పార్ట్ హిట్ కావడంతో కొనసాగింపుగా పొలిమేర -2ను తెరకెక్కుస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. పొలిమేర -2 పోస్టర్స్, టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ రోజు(శుక్రవారం) విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Ma Oori Polimera 2 Movie Review

మొదటి పార్ట్ కొనసాగింపుగానే పొలిమేర-2 ఉంది. పొలిమేర మొదటి పార్ట్‌లో హీరో (సత్యం రాజేష్) చేతబడులు చేయడం గురించి చూపించగా..రెండో భాగంలో అసలు హీరో (సత్యం రాజేష్) ఎందుకు చేతబడులు చేయాల్సి వస్తుందో చూపించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో సినిమాలో చూపించిన ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. గ్రామంలో అందరి మంచి కోరుకునే హీరో (సత్యం రాజేష్) నమ్మకున్న వారిని ఎందుకు నమ్మించి మోసం చేస్తాడనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో మొదటి భాగం ముగుస్తుంది.

Ma Oori Polimera 2 Movie Review

ఇంటర్వెల్ తరువాత సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఓ గుడిలో ఉన్న గుప్త నిధులు చూట్టు సినిమా మొత్తం తిరుగుతుంది. హీరో (సత్యం రాజేష్) ఫ్యామిలీ ఆ గుడి వల్లే ఎందుకు చనిపోతారు..ఆ తరువాత గుడిలో ఏం జరిగిందనేది పొలిమేర-2 కథ. సినిమా మొత్తం ప్రధానంగా నలుగురు క్యారెక్టర్ల చూట్టునే తిరుగుతుంది. అయితే సినిమా ఎక్కువ భాగం చీకట్లో తెరకెక్కించడం ప్రేక్షకులకు కాస్తా ఇబ్బందికి గురైనట్టు కనిపిస్తుంది. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ బాగుంది.

Ma Oori Polimera 2 Movie Review

ఈ ట్విస్ట్ ద్వారా పొలిమేర-3 కూడా ఉంటుందని అర్థం అవుతుంది. మిగిలిన కథను పొలిమేర-3లో చూపించే అవకాశం ఉంది. పొలిమేర మొదటి పార్ట్ చూడని వారికి రెండో భాగం అర్థం కావడం కొంచం కష్టమే. పేపర్ మీద రాసుకున్న కథను దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెర మీద చూపిండంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక గ్యాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించిందనే చెప్పాలి.

పొలిమేర మొదటి భాగం ఎలాగైతే ఆకట్టుకుందో పొలిమేర 2 కూడా అదే విధంగా ప్రేక్షకులను ఆకట్టకుంటుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మొత్తానికి పొలిమేర-2 థియోటర్‌కి వెళ్లిన ప్రేక్షకుడును అసంతృప్తికి అయితే గురి చేయదని కచ్చింతంగా చెప్పవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ..ట్విస్ట్‌‌లతో కూడిన చేతబడల సినిమానే పొలిమేర 2.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+