'మ్యాడ్ స్క్వేర్' రివ్యూ..అదే పెద్ద మైనస్
తెలుగు సినిమాల్లో కామెడీకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథ ఎంత బాగున్నా , అందులో కామెడీని వెతుకుతారు తెలుగు ప్రేక్షకులు. గతంలో చాలా సినిమాలు కామెడీతో ప్రేక్షకులను అలరించాయి. అయితే ఈ మధ్య ప్యాన్ ఇండియా అంటూ మన దర్శకులు సీరియస్ కథలను ఎంచుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో వచ్చిన సినిమానే 'మ్యాడ్'.2023లో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన పనిలేదు.చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో దర్శకుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించారు. 'మ్యాడ్ స్క్వేర్' అంటూ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
కథ
ఈ సినిమా కథ మొత్తం కూడా తమ స్నేహితుడైన లడ్డు పెళ్లి చూట్టునే తిరుగుతోంది. లడ్డు పెళ్లిన ఫ్రెండ్స్ ఏం చేశారు.అతని పెళ్లిలో ఏం జరిగింది. పెళ్లి సమయంలో వీరు గోవాకు ఎందుకు వెళ్లారు..అక్కడ ఈ గ్యాంగ్ ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారనేదే మిగిలిన కథ.ఫస్ట్ హాఫ్ అంతా లడ్డు పెళ్లిలో ఫుల్ కామెడీతో నవ్విస్తారు. గోవాకి వెళ్ళాక అక్కడ వీళ్లు నక్లెస్ కేసులో ఇరుక్కోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సెకండ్ హాఫ్ మీద ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్‌లో ఫ్రెండ్స్ అంతా కలిసి నక్లెస్ కోసం వెతకడం, పోలీసులు వీళ్ల కోసం వెతకడంతో సాగుతుంది.

విశ్లేషణ
అందరూ ఊహించిన విధంగానే సినిమాను ఫుల్ కామెడీతో నింపేశాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. మ్యాడ్ సినిమాలో తాను ఏదైతో చూపించాడో..సీక్వెల్‌లో దానికి మించిన కామెడీని చూపించాడు. ప్రతి సీన్‌లో ఏదో ఒక కామెడీ సీన్‌ని పెట్టే ప్రయత్నం అయితే చేశాడు.ఇక కొన్ని కామెడీ సీన్స్ అద్భుతంగా ఉన్నప్పటికి ఎప్పుడు రొటీన్ రొట్ట కామెడీని ఫాలో అవుతూ ముందుకు సాగడం వల్ల సినిమా మీద కొంత వరకు మనకు ఇదేం కామెడీ అనే ఒక భావన అయితే కలుగుతుంది.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌లు ఎప్పటిలాగే బాగా చేశారు. తమదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.వీళ్ళు ముగ్గురు కలిసి కనిపిస్తే చాలు ప్రేక్షకులకు పండగే.ఇక లడ్డు పాత్రలో నటించిన నటుడుగా కూడా బాగా నటించాడు.ఇక మిగతా ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ కామెడీని ఎలివేట్ చేస్తూ సినిమాకి ఏదైతే కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మొత్తానికైతే ప్రతి పాత్రకి వాళ్ళు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు.
టెక్నికల్ అంశాలు
ఈ సినిమా గురించి మొదటగా మాట్లాడుకోవాలంటే...మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి.బీమ్స్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్‌తో పాటు, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. కామెడీ సీన్స్ లో వాడిన కొన్ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో వచ్చే ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
సంగీత శోభన్ టైమింగ్
మైనస్ పాయింట్స్
కథ లేకపోవడం
రొటీన్ కామెడీ
రేటింగ్: 2.5












Click it and Unblock the Notifications