మహేష్‌బాబు - అల్లు అరవింద్ కాంబినేషన్‌లో మిస్సయిన బ్లాక్‌బస్టర్

నిర్మాతలకు, దర్శకులకు పూర్తిగా సహకరించే మహేష్ బాబు లాంటి హీరోతో సినిమా చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అయితే ఆచితూచి సినిమాలు చేస్తే మహేష్ బాబుతో కాంబినేషన్ సెట్ అవ్వాలంటే ఎంతో కష్టమని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. గతంలో ఎంతోమంది దర్శకులు మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొని కథలను రాసుకునేవారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారుకానీ కొన్ని కథలను ప్రిన్స్ అంగీకరించడంలేదు.

మారుతున్న కాలానికి అనుగుణంగా తీస్తారు
ఎందుకంటే కథల్లో క్యారెక్టర్ పరంగా ఆహార్యాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. తాను అలా మారితే ప్రేక్షకులు ఆదరించరని, ఇలా ఉంటేనే చూస్తారని చెప్పి తనదగ్గరకు వచ్చిన కథలకు ఏ హీరో అయితే బాగుంటాడో చెప్పి వారి దగ్గరకు పంపించేవారు. అయితే నిర్మాతలు కూడా ప్రిన్స్ తో సినిమాలు తీయాలని భావించేవారు. అందులో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా ఒకరు. ఎప్పటికప్పుడు ఆయన మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల ఆలోచనలను పసిగడుతూ అందుకు అనుగుణంగా సినిమాలు తీస్తూ వస్తున్నారు. వాటితో హిట్ కొడుతున్నారు.

mahesh babu and allu aravind combination missed movie

భవిష్యత్తులో కూడా వీరిద్దరూ తీయలేరు
మహేష్ బాబుతో సినిమా తీయాలని అల్లు అరవింద్ ఎంత ప్రయత్నించినప్పటికీ ఎందుకనో ఆ కాంబినేషన్ మాత్రం కుదరడంలేదు. ఇలా చేస్తుంటే వీలుకావడంలేదని భారీ బడ్జెట్ తో, భారీ చిత్రరాజాన్ని ప్రిన్స్ తో నిర్మించాలని అల్లు అరవింద్ భావించారు. బాలీవుడ్ కు చెంది ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని, తెలుగు వరకు మహేష్ బాబును ఒప్పించే బాధ్యత అరవింద్ తీసుకున్నారు. అయితే ఆ సినిమాను చేయడానికి కూడా మహేష్ బాబు నిరాకరించారు. ఆ సినిమా పేరు రామాయణం. ప్రస్తుతం రణబీర్ కపూర్, సాయిపల్లవితో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ముందుగా మహేష్ బాబుతో తీయాలని అరవింద్ అనుకున్నారు.

అయితే సినిమా మొత్తం ఒంటిమీద చొక్కా లేకుండా కనిపించాల్సి ఉండటంతో అందుకు ప్రిన్స్ ఇష్టపడలేదు. తనను ఒంటిమీద చొక్కా లేకుండా చూడాలంటే బాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా అంగీకరించరని మహేష్ బాబు అన్నారు. అలా అరవింద్, సూపర్ స్టార్ కాంబినేషన్ లో సినిమా మిస్ అయింది. వీరిద్దరూ భవిష్యత్తులో సినిమా చేయడం కూడా కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+