విజయ్ దేవరకొండ పునాడా ఏందీ..? మహేష్ బాబుపై నెటిజన్లు భారీ ట్రోలింగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా రిజర్డ్వ్‌గా ఉంటారనే విషయం అందరికి తెలిసిందే. సినిమాలు, ఫ్యామిలీ తప్పిస్తే.. ఆయనకు మరో లోకం తెలియదు. షూటింగ్ సమయంలో గ్యాప్ దొరికితే చాలు.. భార్య, పిల్లలతో కలిసి ఫారిన్ టూర్ చెక్కేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే మహేష్‌లో కొంత మార్పు కనిపిస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్తా యాక్టివ్‌గానే కనిపిస్తున్నారు.
తన సినిమా విశేషాలతో పాటు, జిమ్‌లో వర్క్ అవుట్ చేస్తున్న ఫొటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు చేసిన పనికి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేశారాయన. ఈ ఫొటోల్లో మహేష్ కూర్చీలో కూర్చున్న విధానం , డ్రెస్సింగ్ స్టైల్ ఆయన వ్యవహరశైలికి భిన్నంగా ఉన్నాయి.

సడన్‌గా చూస్తే.. ఈ ఫొటోలో ఉంది మహేష్ బాబేనా అనే విధంగా ఫోజులు ఇచ్చారాయన. దీంతో నెటిజన్లు తమ నోటికి పని చెప్పారు. ఏందీ మహేష్ అన్నా.. విజయ్ దేవరకొండ పునాడా ఏంటీ..? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ గతంలో ఇలాంటి ఫోజులే ఇవ్వడంతో..ఆయనతో పోలుస్తూ.. నెటిజన్లు మహేష్‌ను ట్రోల్ చేస్తున్నారు.

మహేష్ బాబు పలు వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. ఓ వ్యాపార సంస్థకు సంబంధించి యాడ్ షూటింగ్‌లో భాగంగానే మహేష్ ఇలాంటి ఫొటోలు దిగారని తెలుస్తుంది. ఆ ఫొటోలే సొషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం'లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి మహేష్ సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications